Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh పల్నాడు జిల్లాలో దాచెపల్లి తంగేడ గ్రామంలో విషాదం.

పల్నాడు జిల్లాలో దాచెపల్లి తంగేడ గ్రామంలో విషాదం.

by CVR NEWS

పల్నాడు జిల్లాలోని దాచెపల్లి మండలం తంగేడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పునర్నిర్మాణం కోసం పాత ఇంటిని కూల్చివేస్తున్న సమయంలో గోడకు అమర్చిన మెట్లు ఒక్కసారిగా కూలిపడి తాత, మనవడు దుర్మరణం చెందారు. మృతులను గోగుల శ్రీను అలియాస్ రాజబాబు ఆయన నాలుగేళ్ల మనవడు గోగుల యశస్విని నికాంత్‌గా పోలీసులు గుర్తించారు. మెట్లు ఇద్దరిపై పడటంతో తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న దాచెపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనతో తంగేడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: