Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌.

ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌.

by CVR NEWS

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ట్రాన్స్‌కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసాలు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ జరిపిన తనిఖీల్లో వెంకటరమణకు సంబంధించి సుమారు 27.65 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా 10 అపార్ట్‌మెంట్లలో 20 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు లభించాయి. 2 కిలోల బంగారం, 52 లక్షల నగదు, 3 ఖరీదైన కార్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా సీజ్ చేశారు. ఇక తనిఖీల సమయంలో వెంకటరమణ ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా దాచి ఉంచిన 20 మద్యం బాటిళ్లను ఏసీబీ బృందం స్వాధీనం చేసుకుంది. ఆదాయ పరిమితికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టిన కేసు నమోదు చేసి.. ఆయనపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: