50
నిషేధిత జాబితా 22ఏ నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త జీవో తీసుకొస్తున్నామని ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆ జాబితాలో భూములు నమోదు చేసే నిబంధనలను కఠినతరం చేసినట్లు చెప్పారు. ఇకపై 22ఏ నిర్వహణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ పరిధిలో ఉంటుందని చెప్పారు. గ్రామ కంఠం, పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చకూడదన్నారు. వ్యవసాయ భూములకు వెబ్‌ల్యాండ్ 2.0 ప్రామాణికంగా ఉంటుందని.. ఏవిధమైన మాన్యువల్ ఎంట్రీలు ఉండవని స్పష్టం చేశారు.