రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌గా ఆనంద్ మహింద్రా నియమితులు కాబోతున్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం సందర్భంగా ప్రకటించారు. తొలిసారిగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, యువతకు వివిధ ట్రేడ్‌లలో స్కిల్స్ నేర్పించడంతో కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఈ యూనివర్శిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించాల్సిందిగా ఆనంద్ మహింద్రాను కోరానని, రెండు మూడు రోజుల్లో రిప్లై ఇస్తానంటూ ఆయన సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఆయనే చైర్‌పర్సన్‌గా తన సమ్మతిని తెలియజేయనున్నట్లు సీఎం రేవంత్ ఆ వేదిక ద్వారా ప్రకటించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
- కీలక దశకు చేరిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్.తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. వరుసగా చోటుచేసుకున్న పరిణామాలపై క్రమశిక్షణా కమిటీ దృష్టి సారించింది. ఇప్పటికే కొండా సురేఖ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలు, అందుబాటులో ఉన్న ఇతర అంశాలను కమిటీ పరిశీలించినట్లు…
- రష్యా–ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు.రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విస్తృత దాడులు కొనసాగిస్తుండగా.. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగంలోని చమురు, పోర్టు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సుదూర డ్రోన్ దాడులు చేస్తోంది. ఆగస్టు…
- స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కావడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. స్టార్టప్‌ల శక్తి, ఆశయం తనను ఎప్పటిలాగే ముగ్ధుడిని చేశాయని పేర్కొన్నారు. యువ సంస్థల ఆలోచనలు,…
- పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు.పశ్చిమాసియాలో యూఎస్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుండగా.. ఆర్థిక ఒత్తిడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదిస్తున్న కొత్త ఆంక్షలను ఎదుర్కొంటామని ప్రకటించింది. మరోవైపు ప్రపంచ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి