శ్రీకాకుళం నగరపాలక సంస్ద సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్దం చేసిందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాధరావు . సామాన్య ప్రజలకు అన్ని విధాల ఈ మాస్టర్ ప్లాన్ ఉపకరిస్తుందన్నారు. సామాన్యులకు అనుకూలంగా ఉండే విదంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవన నిర్మాణాల విషయంలో సవరణలు తీసుకువచ్చామని వెల్లడించారు. రోడ్లు వెడల్పు తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇప్పటి వరకూ అనుమతులు వచ్చేవికావని తెలిపారు. అందుకే సామాన్యులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోని పదిఅడుగుల రోడ్లులో కూడా ఇంటి నిర్మాణం కోసం అనుమతులు ఇస్తామన్నారు.
Andhra Pradesh
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన కస్టడీ, బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కోర్టుల్లో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
చంద్రబాబుపై నమోదైన కేసులో తమ వాదనలు కూడా వినాలని అందులో కోరింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై చాలా ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని, నిధులను షెల్ కంపెనీలకు దారి మళ్లించి ఎన్ క్యాష్ చేసుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీ శాఖ అని తెలిపింది. ఈ కేసులో తమ వాదనను కూడా మీ ముందు ఉంచడానికి అనుమతివ్వాలని కోరింది.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. అనంతపురం నుంచి మంగళగిరి వరకు చేపట్టిన ఈ సైకిల్ యాత్ర నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చేరుకుంది. సైకిల్ యాత్రకు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ మండల కన్వీనర్ పెలపూడి వెంకటరత్నం తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిరవధికంగా వాయిదా పడింది. తొలుత శుక్రవారం మొదలు పెట్టాలని నిర్ణయించారు. రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ముహుర్తం కూడా నిర్ణయించారు. కనీసం రెండు నుంచి మూడు కిలోమీటర్లు నడవాలని తోలుత తీర్మానించారు. ఆ తర్వాత సమాలోచనల అనంతరం వాయిదా వేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాదనలు ఉన్నాయి. ఈ తరుణంలో అప్పటి వరకు పాదయాత్ర ఉండబోదని టీడీపీ అధికారికంగా ప్రకటించింది. పాదయాత్ర మళ్లీ ఎప్పుడు ప్రారంభించాలనేది తర్వాత వెల్లడిస్తామని వివరించింది. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, తెలుగు తమ్ముళ్లు కూడా వాయిదా వేయాలనే అభిప్రాయపడ్డారు. దీంతో లోకేష్ ఏకీభవించారు. యువగళం పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పున:ప్రారంభ తేదీని ప్రకటించనున్నారు.
ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, జ్యోతి యర్రాజీ సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. క్రీడాకారులు వారు సాధించిన పతకాలను సీఎంకు చూపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలపై తెలుగు వారి ఖ్యాతిని నిలబడినందుకు చాలా ఆనందంగా ఉందని క్రీడాకారులను అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం జగన్ అన్నారు. క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తూ సీఎం వైఎస్ జగన్ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని విడుదల చేశారు.
చిత్తూరు జిల్లా శరన్నవరాత్రులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు చౌడేపల్లిలో శ్రీ బోయకొండ గంగమ్మకు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో చక్రం తిప్పిన వ్యక్తి ఇప్పుడు బెయిల్ పైన బయటకు వస్తే సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని బతకనిస్తారా? అని తనదైన శైలిలో చురకలు అంటించారు. చంద్రబాబు పదేపదే తాను రాష్ట్రపతి, ప్రధానులను నిర్ణయించానని, ఢిల్లీలో చక్రం తిప్పానని చెబుతుంటారు. ఈ వ్యాఖ్యలతోనే విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.




Total views : 202718