Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh ఆయకట్టుకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భరోసా..

ఆయకట్టుకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భరోసా..

by CVR NEWS
ఆయకట్టుకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భరోసా

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సీవీఆర్ న్యూస్ చానెల్ లో ‘మోక్షం ఎప్పుడు’ అని ప్రసారం చేసిన కథనానికి అనూహ్య స్పందన వచ్చింది. పుష్కర ఎత్తిపోతల పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేయడంతో యంత్రాల పరికరాలు తుప్పిపట్టిపోయాయి. పథకం నిలిచిపోవడంతో..ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ విషయంపై సీవీఆర్ న్యూస్ చానెల్ వరుస కథనాలను టెలీకాస్ట్ చేసింది..రైతుల దుస్థితిని, బాధలను కూటమి ప్రభుత్వం దృష్టికి తేవడంతో కీలక భూమిక పోషించింది.
()సీవీఆర్ కథనాలకు ప్రభుత్వం నుంచి విశేష స్పంద వచ్చింది. సుమారు 10 సంవత్సరాల నుండి నిరుపయోగంగా మారిన పుష్కర ఎత్తిపోతల పథకం పనులను 19వ తేదీన విద్యాశాఖ మంత్రి లోకేష్ వచ్చి ప్రారంభిస్తారని చెప్పిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఖరీఫ్ సీజన్ జూలై 20 లోపే అన్ని పనులు పూర్తి చేసి… నీరు అందిస్తామని ఆయకట్టు రైతులకు భరోసా ఇచ్చారు. పుష్కర ఎత్తిపోతల పథకంలో మరిన్ని గ్రామాలకు నీరందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకం పూర్తయితే ,సుమారు 20 గ్రామాల రైతులకు లబ్ధి చేకూరనుంది. 37వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సివిఆర్ న్యూస్ ఛానల్ చొరవతో తమ కలసాకారం కాబోతోందని రైతుల నుంచి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

039625
Total views : 198769

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: