Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh సతీమణితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు హాజరు.

సతీమణితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు హాజరు.

by CVR NEWS
సతీమణితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు హాజరు

చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి కుప్పంలోని ప్రసిద్ధ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు చంద్రబాబు దంపతులకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు నేరుగా ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు తన నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి.

Advertisements

You may also like

Our Visitor

039791
Total views : 200840

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: