Wednesday, September 9, 2026
News Navigation
Wednesday, September 9, 2026
News Navigation

Breaking

Wednesday, September 9, 2026
Home Andhra Pradesh వైభవంగా ప్రారంభం కానున్న ‘అమరావతి ఛాంపియన్ 2.O.

వైభవంగా ప్రారంభం కానున్న ‘అమరావతి ఛాంపియన్ 2.O.

by CVR NEWS
వైభవంగా ప్రారంభం కానున్న ‘అమరావతి ఛాంపియన్ 2.O’

ఆంధ్రప్రదేశ్‌ను ‘క్రీడాంధ్రప్రదేశ్’గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ‘అమరావతి ఛాంపియన్ 2.O’ క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. శాప్ ఛైర్మన్ రవినాయుడు, ఎండీ భరణి, ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, హాకీ ప్లేయర్ రజని కలిసి ఈ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జులై 15 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మూడు దశల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. బాస్కెట్ బాల్, కబడ్డీ, హాకీ, అథ్లెటిక్స్ సహా 12 క్రీడాంశాల్లో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు, క్రీడాకారులు భాగస్వాములు కావడమే లక్ష్యంగా శాప్ ఈ ఏర్పాట్లు చేసింది. విజేతలకు ఏకంగా 94 లక్షల రూపాయల నగదు బహుమతులను అందించనున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: