32
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా పోలీస్ శాఖ సరికొత్త సమరానికి శ్రీకారం చుట్టింది. గంజాయి మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు “పల్లెబాటలో ఈగల్” అనే వినూత్న ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. డుంబ్రిగూడ మండలం కొర్రాయి కొత్తవలస గ్రామంలో విశాఖ జోన్ డీఐజీ రవికృష్ణ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. జూలై 13 నుంచి ఆగస్టు 20 వరకు నెల రోజుల పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ అవగాహన సదస్సులు జరగనున్నాయి. “జీరో గంజాయి సాగు” లక్ష్యంగా.. పోలీసు, రెవెన్యూ, అటవీ, వ్యవసాయ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.



Total views : 207682