Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News అయోధ్య రామాలయం హుండీ వ్యవహారంపై వీహెచ్ మౌన దీక్ష.

అయోధ్య రామాలయం హుండీ వ్యవహారంపై వీహెచ్ మౌన దీక్ష.

by CVR NEWS
అయోధ్య రామాలయం హుండీ వ్యవహారంపై వీహెచ్ మౌన దీక్ష

దక్షిణ అయోధ్య గా పేరు గాంచిన భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు గంట సేపు మౌన పోరాట దీక్ష చేపట్టారు. అయోధ్య రామాలయం హుండీ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మౌన దీక్ష నిర్వహించారు. భక్తుల విరాళాలపై పూర్తి వివరాలను వెల్లడించాలని, హుండీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మౌన దీక్ష లో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న, పూనెం కృష్ణ దొర పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: