44
హెల్మెట్ ఫ్యాషన్ కోసం కాదు… మీ కుటుంబం కోసం.. అంటూ రోడ్డు ప్రమాదాలపై మహబూబాబాద్ జిల్లా గూడూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుపై ఒక్క క్షణం నిర్లక్ష్యం.. జీవితాంతం విషాదంగా మారొచ్చు అని నినదించారు. గూడూరు పోలీసులు చేపట్టిన ఈ ర్యాలీ స్థానిక ప్రజలను ఆకట్టుకుంది. గూడూరు సీఐ వినయ్ కుమార్, ఎస్సై గిరిధర్ రెడ్డి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. గూడూరు ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో పోలీసులు, స్థానిక యువత, వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరించకపోవడం వల్లే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని సీఐ వినయ్ కుమార్ తెలిపారు. బైక్ రైడర్ ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆయన పిలుపునిచ్చారు.



Total views : 207683