జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.ప్రతి ఏడాది రెండుసార్లు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నామని, ఇటీవల పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. అలాగే 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ కూడా అందిస్తున్నామని చెప్పారు.ప్రజా ప్రభుత్వంలో గురుకుల పాఠశాలల్లో డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచడంతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వివరించారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
వేములవాడలో నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ.
34
previous post



Total views : 207683