పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో దేశంలో ఎక్కడా లేనివిధమైన మోడల్ డంపింగ్ యార్డ్ ను కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. ఇప్పటికే స్థల సేకరణకు ప్రభుత్వం నాలుగు కోట్లు కేటాయించిందన్నారు. ఈ కొత్త డంపింగ్ యార్డ్ లో చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ జరిగే విధంగా మోడ్రన్ మిషను ఏర్పాటు చేయబోతున్నామన్నారు . గత ఆరు నెలలుగా పట్టణ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించిన ప్రభుత్వం ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రజలు ఎవ్వరికి ఇబ్బంది లేని స్థలాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించిందన్నారు. స్థల సేకరణ విషయంలో ఎవరైనా రాజకీయం చేసిన , సంబంధం లేని వ్యక్తులు ప్రజల్ని రెచ్చగొడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితోనే ఈ మోడల్ యూనిట్ నరసాపురంగా మంజూరు అయిందని చెప్పారు.
నర్సాపురంలో మోడల్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు..
56
previous post





Total views : 90260