పెట్రోల్ ధరల పెంపుపై జగిత్యాలలో కాంగ్రెస్ నిరసన ర్యాలీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. ధర్నా నేపథ్యంలో బస్‌స్టాండ్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సును పోలీసులు దారి మళ్లించారు. బస్సు డ్రైవర్ అశోక్ ధర్నాను గమనిస్తూ.. ముందు ధాన్యం, మక్కలు కొనండి..తర్వాత పెట్రోల్ ధరలు ఎప్పుడైనా దించుకోవచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. అశోక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో డ్రైవర్ ఆశోక్ పై ఆర్టీసీ యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. తనను విధుల్లోకి రావొద్దని రీజినల్ మేనేజర్ రిమూవల్ లెటర్ పంపినట్లు అశోక్ వెల్లడించారు. తాను ఏ రాజకీయ పార్టీని లేదా నాయకుడిని విమర్శించలేదని.. రైతుల గురించి మాత్రమే మాట్లాడానన్నారు. దీనికి తనను డ్యూటీకి రావద్దని ఆర్ఎం నుంచి రిమూవల్ లెటర్ వచ్చిందని, ఐదు డిపోలకు తనకు డ్యూటీ వేయొద్దని లెటర్ పంపినట్లుగా అశోక్ వెల్లడించారు.
పెట్రోల్ ధరల పెంపుపై జగిత్యాలలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ..
56
previous post





Total views : 90108