Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Latest News పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత ఎన్నికలు..

పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత ఎన్నికలు..

by CVR NEWS
పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత ఎన్నికలు

పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత సమరం పీక్ స్టేజ్‌కు చేరింది. రాష్ట్ర భవితవ్యాన్ని తేల్చే 142 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. అటు దీదీ.. ఇటు మోదీ.. హోరాహోరీగా సాగుతున్న ఈ పోరులో గెలుపు గుర్రం ఎవరిది? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు తుది ఘట్టానికి చేరుకుంది. మొత్తం 294 స్థానాలకు గాను, రెండో దశలో భాగంగా నేడు 142 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 23న జరిగిన తొలి విడతలో 152 స్థానాలకు పోలింగ్ పూర్తికాగా.. నేడు మిగిలిన స్థానాల్లో యుద్ధం నడుస్తోంది. సుమారు 3.2 కోట్ల మంది ఓటర్లు 1,448 మంది అభ్యర్థుల తలరాతను తేల్చబోతున్నారు.

అందరి కళ్లూ ఇప్పుడు భవానీపూర్ పైనే ఉన్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సవాల్ విసిరిన బీజేపీ నేత సువేందు అధికారి.. ఇద్దరూ తలపడుతున్న ఈ సీటు హాట్ సీట్‌గా మారింది. అనూహ్యంగా చక్రబేరియాలోని ఒక బూత్ వద్ద వీరిద్దరూ ఎదురుపడటం సంచలనంగా మారింది. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ పక్కపక్కనే వెళ్లడం ఉత్కంఠ రేపింది. ఇక క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చప్రా, శాంతిపూర్ ప్రాంతాల్లో తృణమూల్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. హౌరాలో ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసను కట్టడి చేసేందుకు ఈసీ 3.5 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. ఈసారి NIA కూడా రంగంలోకి దిగడం విశేషం.

కేంద్ర బలగాలు, ఈసీ టెర్రరిజానికి పాల్పడుతున్నాయి.. బీజేపీకి తొత్తులుగా మారాయి” అంటూ మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. మరోవైపు, డైమండ్ హార్బర్ మోడల్ పేరిట టీఎంసీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఒంటిగంట వరకు 61.11 శాతం ఓటింగ్ నమోదై ఓటర్ల ఉత్సాహాన్ని చాటిచెప్పింది. భారీ వర్ష సూచన ఉన్నప్పటికీ ఓటర్లు గొడుగులతో తరలిరావాలని అధికారులు కోరుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039674
Total views : 199168

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: