లోక కళ్యాణార్ధం యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ నిర్వహించిన హరిహర మహా యజ్ఞానికి ప్రజలు పోటెత్తారు. కార్తీకమాసం పర్వదినాలను పురస్కరించుకొని ప్రంపంచంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, యానాం పరిసర ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఈ యజ్ఞం నిర్వహించినట్లు అశోక్ తెలిపారు. ఉదయం వేకువ జామునుండి ప్రారంభమైన ఈ మహా యజ్ఞం గొల్లపల్లి శ్రీనివాస అశోక్ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హరిహర యజ్ఞం శివపార్వతుల కళ్యాణం, మహా మృత్యుంజయ హోమం, లక్ష బిల్వార్చన, రుద్రాక్షలతో అభిషేకం ఋత్విక్కులు నియమ నిష్టలతో అశోక్ దంపతులచే చేయించారు. యానాంకు చెందిన మహిళలచే లలితా సహస్రనామ కార్యక్రమం, గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. యానాం ప్రజలు, వరదలు, తుఫానులు వంటి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వీటినుండి పరమశివుడు యానాం ప్రజలందరినీ కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అశోక్ తెలియచేసారు. సాయంత్రం గోదావరి మాతకు అంగరంగ వైభవంగా పంచహారతులు ఇవ్వనున్నారు.
Devotional
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి అత్యుత్సాహం ప్రదర్శించాడు. కాకి బట్టలతో తమకు తెలిసిన వారిని, ఆలయం ఎగ్జిట్ ద్వారం నుండి లోపటికి తీసుకెళ్తూ, ఓవరాక్షన్ ప్రదర్శించాడు. పేదల దేవుళ్ళుగా చెప్పుకునే రాజన్న ఆలయంలో, సాధారణ భక్తులకు తిప్పలు తప్పడం లేదనడానికి, నిదర్శనం ఈ సంఘటన. శని ఆదివారాలు, సెలవు దినం కావడంతో రాజన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఓ పోలీసు ఉన్నతాధికారి తనకు తెలిసిన వారిని ఎగ్జిట్ ద్వారం గుండా గుడిలోకి తీసుకెళ్లగా, ఇలా ఎందుకు తీసుకెళ్తున్నారని స్థానికులు అడుగగా, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే ఆ పోలీస్ ఉన్నతాధికారి ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది సాయంతో లోపటికి తీసుకెళ్లడం గమనార్హం. సాధారణ భక్తులేమో తిప్పలు పడాల, పోలీస్ అధికారైతే అడ్డదారిలో పోవాలా అంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అటు పోలీస్ ఉన్నతాధికారి వ్యవహార శైలి, ఆలయ సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేసి చూడాల్సిందే అని స్థానికులు అంటున్నారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్బంగా.. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, టీటీడీ అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలుపొంది కార్యకర్తల జనసందోహంతో భారీ ర్యాలీతో తొలిసారిగా మండల కేంద్రానికి విచ్చేసి ప్రముఖ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన కోరిన కోరికలు తీర్చే స్వయంభు శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. అనంతరం దేవస్థానం వేదపండితులు నూతన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి శేష వస్త్రాలు అందించి ఆశీర్వచనం అందించారు.
కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి వేలాది మంది తరలి వచ్చారు. ఉదయమే పవిత్రమైన ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూ లైన్ల మీదుగా ఆలయంలోకి వెళ్లి స్వామివారు ను దర్శించుకున్నారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కును చెల్లించారు. ఆలయంలో రద్దీతో స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది.
Read Also..
శ్రీశైలం దేవస్థానంలో 38 మంది సిబ్బందికి అంతర్గత బదిలీలు. ఈవోగా బాధ్యత చేపట్టిన తర్వాత మొదటిసారి 38 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో పెద్దిరాజు. ఈ బదిలీలలో 6 మంది ఏఈవో స్థాయి అధికారులు. పరిపాలన సౌలభ్యం కోసం బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో పెద్దిరాజు. పర్యవేక్షకుడు మల్లికార్జునరెడ్డికి ఏఈఓగా పదోన్నతి కల్పిస్తూ విధులు కేటాయింపు. 24 గంటల్లో వారికి కేటాయించిన విధుల్లో రిపోర్టు చేయాలని ఈవో ఆదేశాలు. ఈరోజు,రెపట్లో మరికొంతమంది ఉద్యోగులను బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా , కార్తీక మాసం సందర్భంగా, పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి రోజా.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉన్నానంటే స్వామివారిని దర్శించుకున్నకే వచ్చాయని, స్వామివారి కృప పండితులైన బ్రాహ్మణులు ఆశీర్వచనం వల్లే కలిగాయని, జగనన్న ఇంకొక 30 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగజేయాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి రోజా అన్నారు.
అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఆలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయం గర్భగుడి ఫొటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. మరో నెల రోజుల్లో ఆలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాగా, జనవరిలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 16 నుంచి ఈ క్రతువు చేపట్టనున్నారు. జనవరి 22న మూల విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. అంతేకాదు, 130 దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్లపై కార్లు బస్సులు నిలిచిపోయాయి. సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది వరుస సెలువులు అందులోను కార్తీకమాసం చివరి రోజులు కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వాహనాలలో భారీగా తరలి వస్తున్నారు. భక్తులరద్దిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు స్వామివారి స్పర్శ దర్శనం అభిషేకాలు పూర్తిగా రద్దు చేశారు. భక్తులందరికి స్వామివారి దర్శనం కల్పించేందుకు అందరికి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా సొంత కార్లలో తరలి వస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి వెళ్లె వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీశైలం నుండి హటకేశ్వరం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖద్వారం నుండి శ్రీశైలానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. అయితే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్స్ తో అష్టకష్టాలు పడుతూ ట్రాఫిక్ ని అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాండవ్య నది ఒడ్డున వేలిసియిన్న అతి పురాతనమైన పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం నందు శ్రీశైలం వేద పండితులచే ఆలయ పశ్చిమ రాజగోపుర కుంభాభిషేక, సాలహార మహోత్సవ ,హోమం కార్యక్రమాలు శుక్రవారం నుంచి ఘనంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు జరుగుతున్నా హోమం, పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. వారికీ ఆలయ చైర్మన్ పొలం రెడ్డి విజయమ్మ వారి భర్త మున్సిపల్ వైస్ చైర్మన్ పోలం రెడ్డి దశరథ రామిరెడ్డి, ఆలయ ఈవో రమణా రెడ్డి ల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం వేద పురోహితులు పరమేశ్వర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నా హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోనున్న వినాయకుడిని, అఘోర లింఘేస్వరుడు తో పాటు శ్రీ వీరభద్ర స్వామి అమ్మవార్లను దర్శించుకొన్నారు. వారికీ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. స్వామి వారి ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకునే విధంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అన్నారు. ఆలయ అభివృద్దితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కావాల్సిన వసతి ఏర్పాట్లు తదితర అంశాల గురించి వారిని అడిగి తెలుసుకొన్నారు. ఆలయ చైర్మన్ పొలం రెడ్డి విజయమ్మ, ఈవో రమణా రెడ్డి, శ్రీశైలం వేదం పురోహితులు పరమేశ్వర స్వామి లు మాట్లాడుతూ 2019 లో సిఎం జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ రాజ గోపురం నిర్మాణానికి శంఖుస్థాపన చేశారన్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆ కార్యక్రమం అప్పట్లో నిర్వహించలేకపోయామన్నారు. తిరిగి స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ కృషితో పశ్చిమ రాజగోపురం సాలహారం ల నిర్మాణాలకు రూ 1.58 కోట్ల నిధులు మంజూరై పనులు కూడా పూర్తి కావడంతో శుక్రవారం నుండి పశ్చిమ రాజగోపుర కుంభాభిషేక, సాలహార మహోత్సవ పూజలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు వారు తెలియజేశారు. అందరికి శ్రీ భద్ర కాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి సంపూర్ణ కృపా కటాక్షాల తో పాటు శ్రీ భ్రమ రాంబ మల్లి కార్జున ఆశీస్సులతో మెండుగా కలగాలని ఇటువంటి దైవ కార్యక్రమాలు ఎన్నెన్నో నిర్వహించాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నామన్నారు. ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగాప్రసాద్, కమిటీ సభ్యులు రత్న శేఖర్ రెడ్డి, సంబేపల్లె నాయకులు వివి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.