శ్రీకాళహస్తి స్వామి వారి సేవలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. శ్రీకాళహస్తి స్వామి అమ్మ వారిని సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవాళ్ళ తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు..
Devotional
సనాతన ధర్మం అనేది భారతీయ భూమిలో పుట్టిన అత్యంత పురాతన మరియు క్రమబద్ధమైన మతం. ఇది దాదాపు 5,000 సంవత్సరాల క్రితం ఉద్భవించింది మరియు ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద మతాలలో ఒకటిగా ఉంది.
సనాతన ధర్మం అనేక విశిష్టతలను కలిగి ఉంది, ఇది దానిని ఇతర మతాల నుండి భిన్నంగా చేస్తుంది. ఈ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి:
- వాస్తవికత యొక్క ఆధారం: సనాతన ధర్మం ప్రపంచం నిర్మించబడినట్లు చూపిస్తుంది, దేవతలు మరియు భావనలకు మించి ఏదీ లేదు. ఈ ధర్మం యొక్క ఆలోచనా విధానం ప్రపంచం యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
- వేదాల యొక్క ప్రాముఖ్యత: సనాతన ధర్మం వేదాల ఆధారంగా ఉంది, ఇది భారతదేశంలోని అత్యంత పురాతన మరియు పవిత్ర గ్రంథాలు. వేదాలు మానవ జీవితం యొక్క అన్ని అంశాలకు సంబంధించిన వివరణలను అందిస్తాయి, అది మతం, సమాజం, శాస్త్రం మరియు తత్వశాస్త్రం వంటివి.
- ఆత్మ యొక్క అస్తిత్వం: సనాతన ధర్మం మానవుడు శరీరానికి అతీతమైన ఆత్మను కలిగి ఉంటాడని నమ్ముతుంది. ఈ ఆత్మ అనంతమైనది మరియు మనుష్యులకు పునర్జన్మలో ప్రయాణించడానికి అనుమతిస్తుంది.
- యోగా మరియు ధ్యానం యొక్క ప్రాముఖ్యత: సనాతన ధర్మం యోగా మరియు ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనాలను ప్రోత్సహిస్తుంది. ఈ సాధనాలు మనస్సును మరియు ఆత్మను శుద్ధి చేయడానికి మరియు మానవుడిని అతని లక్ష్యాలను సాధించడానికి సహాయపడతాయి.
- సహనం మరియు సామరస్యం యొక్క ప్రాముఖ్యత: సనాతన ధర్మం సహనం మరియు సామరస్యం వంటి సద్గుణాలను ప్రోత్సహిస్తుంది. ఈ సద్గుణాలు మనుష్యులను ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మరియు ప్రశాంతమైన సమాజాన్ని నిర్మించడానికి సహాయపడతాయి. ఈ కొన్ని ప్రత్యేకతలు సనాతన ధర్మాన్ని ఒక అద్భుతమైన మతంగా చేస్తాయి. ఇది మానవజాతి యొక్క ఆధ్యాత్మిక, మానసిక మరియు సామాజిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధరణం. శ్రీవారి దర్శనం కోసం 04 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,176 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న హుండీ ఆదాయం..4.22 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…20,157 మంది.టోకెన్ లు లేని భక్తులకు 8 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
శ్రీశైలంలో వైభవంగా కార్తీకమాస రెండవ సోమవారం లక్షదీపోత్సవం కన్నులపండువగా సాగిన పుష్కరిణి హరతి
శ్రీశైలంలో కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం,దశ హారతులిచ్చారు కార్తికమాస రెండవ సోమవారం కావడంతో పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా జరిగింది పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి అర్చకులు వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవ మూర్తులకు పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశ హరతులిచ్చి భక్తులను దీవించారు దశ హారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి వద్ద భక్తులతో కిటకిటలాడింది ఉదయం నుంచి శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్తులతో పోటెత్తింది ఈ లక్షదీపోత్సవంలో భక్తులు,ఆలయ సిబ్బంది కార్తీక దీపాలను వెలిగించారు.
పవిత్ర కార్తీక మాసం అందున కార్తీక పౌర్ణమి సోమవారం కావడంతో కొత్తపేట నియోజకవర్గం లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువలో పుణ్య స్నానాలు ఆచరించారు. రేవు ఆవరణలో మహిళలు అరటి డొప్పలలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి పూజలు చేసి కాలువలో వదిలారు. మరో ప్రక్క ఓంకార నాదంతో శివాలయాలు మార్మోగాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు సమీపంలో గల శైవ క్షేతాలకు వెళ్లి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండల పరిధిలోని పలివెల శ్రీ ఉమాకొప్పెశ్వరస్వామి దేవాలయం నందు తెల్లవారుజామునుండే స్వామి దర్శనం కొరకు శివాలయం నందు బారులు తీరారు.అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.ఓ ప్రక్క భక్తులు ప్రదక్షిణలు చేస్తూ హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివ నామస్మరణతో మార్మోగించారు.కార్తీక దీపాలతో మహిళల సందడి ఎక్కువైంది.స్వామి వారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అభిషేకాలు నిర్వహించుకున్నారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో 20 రూపాయలు ప్రత్యేక దర్శనం తో పాటు ఉచిత దర్శనం దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూలైన్లు ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ భమిడిపాటి దుర్గా లక్ష్మినారాయణ, దేవస్థాన సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
శ్రీశైలంలో కార్తీక మాసం పౌర్ణమి రెండవ సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ పాలు ప్రసాదాలు అందచేస్తున్నారు. శని,అది,సోమవారాలలో స్పర్శ దర్శనం,సామూహిక, గర్భాలయా అభిషేకాలు నిలుపుదల చేశారు. నేడు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అలానే నేటి సాయంత్రం కార్తీక మాసం పౌర్ణమి రెండవ సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి ఆర్.కె.రోజాకు ఆలయ అర్చకులు,ఆలయ ఈవో పెద్దిరాజు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోజా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు దర్శనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన లక్షదీపోత్సవం దశ హారతులలో మంత్రి ఆర్. కె.రోజా పాల్గొన్నారు.
Read Also…
Read Also…
శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు మద్యాహ్నం కార్తీక పౌర్ణమి ఘడియలు రావడంతో క్షేత్రం భక్తులతో నిండిపోయింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ముందు బాగంలో గల గంగాధర మండపం వద్ద అత్యంత వైభవంగా కన్నులపండువగా జ్వాలాతోరణోత్సవాన్ని దేవస్థానం నిర్వహించారు ముందుగా ఆలయ ముందుబాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థంబాలపై నూలుతో తయారుచేసిన ఒత్తులను నెయ్యితో తడిపి స్థంబాలపై ఉంచి శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు ఆలయం లోపలి నుంచి ఉత్సవమూర్తులు పల్లకిలో ఊరేగింపుగా తరలిరాగా గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్ద శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఈవో పెద్దిరాజు,ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్.కె.రోజా, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి జ్వాలాతోరణాలను దివిటీ లతో వెలిగించగా భక్తులు ఓం నమః శివాయ హరిహర మహాదేవ శంభో శంకరా అంటూ శివ నామస్మరణలతో క్షేత్రం మారుమ్రోగింది భారీగా తరలి వచ్చిన భక్తులు జ్వాలాతోరణొత్సవం దర్శనం చేసుకుని పునుతులైయ్యారు ఓ పక్క జ్వాలాతోరణం జరుగుతుండగా మరోపక్క కృష్ణవేణి నదిమాతల్లికి వివిధరకాల హరతులిచ్చి కృష్ణమ్మకు సారె సమర్పించారు మరోపక్క గంగాధర మండపం వద్ద ఒత్తులు మంటలతో వెలుగుతుండగా మరో పక్క భక్తులు జ్వాలాతోరణం కిందనుంచి దాటుతూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు జ్వాలతోరణం ఒత్తుల భస్మాన్ని దక్కించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో పోటీపడగ అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం దశవిధా హారతుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
కడప జిల్లా.. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రొద్దుటూరు లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ప్రొద్దుటూరు లోని ప్రసిద్ధ ఆగస్తేశ్వర ఆలయం, పెన్నా నది తీరాన రెండవ కాశీగా పేరుగాంచిన శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయాలలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్బంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శివ సన్నిధిలో బారులు తీరారు. మహిళలు ఎంతో నిష్టతో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి పూజలు చేశారు. గర్భాలయంలోని శివ లింగానికి ఏకవార రుద్రాభిషేకం, ఉత్సవమూర్తులకు అభిషేకం, రుద్ర హోమం నిర్వహించారు. భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
కార్తీక మాస పౌర్ణమి సోమవారం పర్వతనాన్ని పురస్కరించుకుని హంసలదీవి గ్రామ సమీపంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణా సాగర సంగమం, సముద్ర తీరం భక్తజన సందోహంగా మారింది. వేలాదిగా భక్తులు తరలిరావడంతో సముద్ర తీరం భక్తులతో తిక్కిరిసింది. సముద్ర తీరానికి సుదీర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి సముద్రునికి నమస్కరించి ప్రత్యేక పుణ్య స్థానాలు ఆచరించి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతోసముద్రవద్ద భక్తులు కు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోడూరు నుంచి సాగర సంగమం వద్దకు వెళ్లే రహదారి పూర్తిగా శిధిల వ్యవస్థ చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన రుక్మిణి సత్యభామసమేత వేణుగోపాలస్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
Read Also..