కాణిపాకం క్షేత్ర సమీపంలో బాహుదానది ప్రవహించేది. దాని ఒడ్డున ఓ బావి ఉండేది. దాంట్లో వినాయకుడు వెలిశాడనీ బావిలో నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం. అప్పుడు చోళరాజుల ఏలుబడిలో ఉండేది ఈ ప్రాంతం. ఆ ఊరిపేరు విహారపురి.కాణిపాకం క్షేత్ర సమీపంలో బాహుదానది ప్రవహించేది. దాని ఒడ్డున ఓ బావి ఉండేది. దాంట్లో వినాయకుడు వెలిశాడనీ బావిలో నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం. అప్పుడు చోళరాజుల ఏలుబడిలో ఉండేది ఈ ప్రాంతం. ఆ ఊరిపేరు విహారపురి. ఆ గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు ఉండేవారు. వారు పుట్టుకతో మూగ చెవుడు గుడ్డివారు. ఇన్ని వైకల్యాలున్నా చక్కగా వ్యవసాయం చేసేవారు. స్వయంగా బావి తవ్వి మోట కొట్టి సాగుచేసుకునేవారు.ఒకసారి వర్షాభావం కారణంగా బావిలో నీళ్లు తగ్గాయి. దీంతో బావి మరింత తవ్వాలని నిర్ణయించుకున్నారు. తవ్వుతున్నప్పుడు ఠంగ్మనే శబ్దం వినిపించింది. పరిశీలిస్తే బావిలో పెద్ద రాయి. దానిని తొలగించడానికి గడ్డపార దెబ్బ వేయగా దాంట్లో నుంచి రక్తం పైకి ఎగిసింది. రక్తం ఆ ముగ్గురి స్నేహితులపై పడగానే వారి వైకల్యం పోయిందట. ఆ నోటా ఈ నోటా విషయం ఊరంతా తెలియడంతో బావిని మరింత లోతుకు తవ్వారు. అప్పుడు గణనాథుడి విగ్రహం బయల్పడింది. భక్తి పారవశ్యంతో ప్రజలు కొబ్బరికాయలను సమర్పించారు. వీటిలో విశేషంగా పగిలిన కొబ్బరికాయల నీటి ద్వారా ఆ ముగ్గురు సోదరులు నిలుచున్న భూమి అంతా ప్రవహించింది. అలా ఈ స్థలానికి కాణి పారడం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే కాణిపాకంగా మారింది. కులోత్తుంగ చోళుడనే రాజు ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఇక అప్పటి నుంచి బావిలోని వినాయకుడు పెరుగుతున్నాడని భక్తులు అంటున్నారు. దీనికి సాక్ష్యం వినాయకుడు ధరించిన వెండి కవచాలు సరిపోకపోవడమే. ఇప్పటికి మూడుసార్లు వెండి కవచాలు మార్చినట్లుగా ప్రజలు చెప్తున్నారు. ఈ ఆలయం సత్యప్రమాణాలకు నెలవుగా భాసిల్లుతున్నది. వరసిద్ధి వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత. ఎలాంటి వివాదాలు వచ్చినా.. నేరారోపణలు జరిగినా నిర్దోషిత్వ నిరూపణకు ఈ క్షేత్రమే కేంద్రం అనేది ప్రజల ప్రగాఢ నమ్మకం. బ్రిటిష్ కాలంలో కూడా ఇక్కడ సత్య ప్రమాణాలు చేసే ఆనవాయితీ కొనసాగింది. ప్రతియేటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు వినాయకచవితి రోజే ప్రారంభమవుతాయి. అంకురార్పణతో ప్రారంభించి 21 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. బ్రహ్మాది దేవతలు వచ్చి ముద్దుల గణపతిని దర్శించుకొని వెళ్తారని భక్తుల నమ్మకం.
Devotional
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం నిన్న సాయంత్రం రేణిగుంట చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో రేణిగుంట వచ్చారు. రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసి, ఈ ఉదయం సతీసమేతంగా చంద్రబాబునాయుడు వెంకటేశ్వరస్వామి దర్శనం.
దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం. శివకేశువులు ఒకేచోట వెలసిన దివ్యక్షేత్రం. స్వామివారి ఎదురుగా పెద్ద రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు వద్ద భక్తులు దీపాలు పెడతారు. ప్రస్తుతం ఆ దీపాలపై వివాదం నెలకొంది. కార్తీక మాసంలో పెట్టే దీపాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక కార్తీకమాసంలో పెట్టె ఆవు నేతి దీపంకు మరింత ప్రాధాన్యత ఉంది. అయితే స్వచ్ఛమైన ఆవు నేతి దీపాలు పెట్టాలని చెబుతారు. కానీ కొండపై షాపులు పెట్టినవారు ఆవు నేతి దీపాలు అంటూ డాల్డా, కల్తీ నూనె దీపాలు విక్రయిస్తున్నారు. దీంతో భక్తులు ఆందోళన చేస్తున్నారు. పుణ్యం రాకపోగా పాపం వస్తుందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ఈవో, అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది.
Read Also..
గోదావరీ నిదీ పరీవాహక ప్రాంతమైన అహమద్ నగర్ జిల్లాలో ఒక కుగ్రామమైన శిరిడీలో ఒక పాడుబడ్ద మశీదులో స్థిర నివాసమేర్పరుచుకున్న శ్రీ సాయిబాబా నిత్యం తన మశిదులో రాత్రిళ్ళు దీపాలను వెలిగించే వారు. దీపాలని వెలిగించేందుకు అవసరమయిన నూనెను ఆ ఊరులోని షాహుకార్ల వద్ద నుండి యాచించి తెచ్చేవారు.మానవుని హృదయంలో జన్మాంతరాలుగా పేరుకొనిపోయి వున్న అజ్ఞానపు చీకట్లను పటాపంచలు చేసి, వారికి సన్మార్గం చూపేందుకే ఈ దీపాలను వెలిగిస్తున్నానని శ్రీ సాయి తన భక్తులతో తరచుగా చెప్పేవారు. ఆ గ్రామంలో బాలా భాటే అనే ఒక ఆసామికి శ్రీ సాయి యొక్క పద్ధతులు నచ్చేవి కావు, శ్రీ సాయి ఒక పిచ్చి ఫకీరని, చిన్నపాటి క్షుద్ర విద్యలను నేర్చుకొని ప్రజలను మోసం చేస్తున్నాడని భాటే ఆ ఊరి ప్రజలకు చేప్పేవాడు. పైగా మహ్మదీయుడైన సాయి మశీదులో హిందువుల ఆచార పద్ధతిలో దీపాలను వెలిగించడం హిందువుల మత విశ్వాసాలను మంటగలపడమేనని అందరినీ రెచ్చగొట్టసాగాడు. భాటే మాటలను నమ్మినా ఆ ఊరి వర్తకులు ఒకసారి కూడబలుక్కొని శ్రీ సాయికి నూనెను ఇవ్వరాదని నిశ్చయించుకున్నారు. ఆ సాయంత్రం సాయి నూనె కోసం యాచనకు వెళ్ళినప్పుడు వర్తకులందారూ మెము నూనెను ఇవ్వమని ఖచ్చితంగా చెప్పేసారు. శ్రీ సాయి ఇంకెమి బదులివ్వక, ‘అల్లా అచ్చా కరెగా” అని వారిని ఆశీర్వదించి ఖాలీ చేతులతో మశీదుకు తిరిగి వెళిపోయారు. ఆ రాత్రి ఆ పిచ్చి ఫకీరు ఇక దీపాలను ఎలా వెలిగిస్తాడో చూద్దామని భాటేతొ కలిసి వర్తకులందరూ మశిదుకు వెళ్ళి దూరంగా దాక్కోని జరిగే తతంగాన్నంతటినీ వేడుకగా చూడసాగారు. రాత్రి అయ్యాక, శ్రీ సాయి కొద్దిపాటి నూనె చుక్కలున్న ఆ తంబిరేలు డబ్బాలో నీళ్ళను పోసి, ఆ నీటినంతటినీ తాగేసి తిరిగి ఆ డబ్బాలోకి వొంపేసారు. ఈ విధంగా నూనె చుక్కలతో కలిసిన ఆ నీళ్లను తన నోటితో పావనం చేసాక ఆ నీటిని ప్రమిదలలో పోసి వెలిగించగా ఆశ్చర్యాలలో కెల్లా ఆశ్చర్యంగా ప్రమిదలన్నీ మరింత ఎక్కువ కాంతితో తెల్లవార్లూ అద్భుతంగా వెలిగాయి. ఈ వింతను చూసిన ఆ వర్తకుల అజ్ఞానం నశించింది. శ్రీ సాయి సామాన్యుడు కాదని, ఒక గొప్ప యోగియని వారికి అప్పుడు అవగతం అయ్యింది. శ్రీ సాయి సాక్షాత్ భగవత్స్వరూపుడు కాకపోతే తన శక్తితో నీళ్ళను నూనెగా మార్చివెయగలుగుతారా ? సాధారణ యోగులకు ఇది సాధ్యమా ?పశ్చాతాపంతో వర్తకులందారూ శ్రీ సాయి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. దయామయుడైన సాయి ఆ వర్తకులను క్షమించి అప్పుడు ఒక అపూర్వమైన బోధ చేసారు” నాయనలారా ! అసత్యమంటే ఆ భగవంతునికి గిట్టదు. ఎల్లఫ్ఫుడూ సత్యాన్నే అంటి పెట్టుకొని వుంటే అది మనల్ని తప్పక రక్షిస్తుంది.ఇతరులను బాధ పెట్టి వేడుక చూడాలని ఎన్నడూ ప్రయత్నించవద్దు. ఇతరులకు పంచి ఇచ్చిన ఐశ్వర్యం వంద రెట్లు అయ్యి తిరిగి వచ్చినట్లే ఇతరులను మనము పెట్టి బాధలు వెయ్యింతలై మన వద్దకే తిరిగి వస్తాయి. ఎన్నడూ చెప్పుడు మాటలను విన్నవద్దు. అవి మనల్ని అధోగతి పాలు చేస్తాయి, మనకు ఏం కావాలన్నా, ఏం తెలుసుకోవాలన్నా ఆ భవవంతుడినే అడిగి తెలుసుకోవాలి” పరిశుద్ధ పరబ్రహ్మ అవతారమైన శ్రీ సాయినాధుని అమృత పలుకులను మనసారా వంటపట్టించుకున్న ఆ వర్తకులందరూ సాయి ఆశీర్వాదములను తీసుకొని సంతోషంగా తమ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.
అఖిలాంఢకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయినా శ్రీ సాయినాధుని లోని విశిష్ట ఏమిటంటే కల్పవృక్షం, కామధేనువు కంటే భిన్నంగా అడిగినవారికీ, అడగనివారికీ కూడా వారికి నిత్య జాగృతుడై, కావల్సినవన్నింటినీ సమకూర్చి, మొదట వారి భౌతిక అవసరాలను తీర్చి, పిమ్మట వారిని అధ్యాత్మిక మార్గంలో పయనింపజేస్తారు. అంతే కాక మొదటి నుండి వారి వెంట వుండి,వారిని దారి తప్పకుండా మార్గ దర్శి వలే నిలిచి,చివరికంటా గమ్యం చేరుస్తారు. తనకు సర్వస్య శరణాగతి చేసిన భక్తులకు ఎళ్ళవేళలా రక్షణ కవచాన్ని అందిస్తూ వారికి ముక్తిని ప్రసాదించే అతి శక్తివంతుడు, ఆర్తత్రాణ పరాయణుడు శ్రీసాయినాధులు. ఇప్పుడు ఆ మహనీయుడు చేసిన ఒక అద్భుతమైన లీలను స్మరించుకుందాం. పూనా జిల్లా, జున్నూరు తాలూకా నారాయణ గ్రామము వాస్తవ్యుడు అయిన భీమాజీ పాటిల్ కు ఒకసారి ఉపిరితిత్తుల వ్యాధి సోకి, క్రమంగా అది క్షయగా పరిణమించింది. వైద్య విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజులలో క్షయవ్యాధిని మృత్యు ద్వారంగా పరిగణించేవారు. స్వతాహాగా ధనవంతుడైన భీమాజీ ఎన్నో రకములైన మందులను వాడాడు, ఎందరో ప్రసిద్ధమైన దాక్టర్లకు చూపించాడు కాని ఆ వ్యాది ఇసుమంతైనా తగ్గలేదు. ఇక ప్రాణం మీద ఆశ వదులుకొని ” ఓ భగవంతుడా నీవే నాకిక దిక్కు” అని రాత్రింబవళ్ళూ అతి దీనంగా ప్రార్ధించసాగాడు. అతని ప్రార్ధనలు ఆ సాయికి చేరాయా అన్నట్లుగా ఆ తర్వాత భీమాజి తన అనారోగ్యం వివరాలను సాయి భక్త శిఖామణి నానా చందోర్కర్ కు రాసాడు. అందుకు నానా ” అన్ని వ్యాధులకు ఏకైక నివారణ సర్వస్య శరణాగతి చేసి సాయి పాదాలపై పడుటయే” అని సమాధానమిచ్చాడు. అప్పుడు భీమాజీ నానా సలహాపై అధారపడి తన బంధువుల సహాయంతో శిరిడీకి వచ్చి మశిదులో బాబా కాళ్ళపై పడి తన వ్యాధి తగ్గించమని ప్రాధేయపడ్డాడు. ఈ వ్యాధి అతని గత జన్మల ప్రారబ్ధ ఫలితమని, ఆ పాపములను అనుభవించి వాటి నుండి విముక్తి అవ్వడమే సరైన మార్గమని, అందువలన ఈ విషయంలో తాను కలుగజేసుకొనడం లేదని బాబా ఖచ్చితంగా చేప్పేసారు.ఆ మాటలకు హతాశుడైన భీమాజీ తనకు వెరే దిక్కు లేదని, సాయి కల్పించుకోకపోతే ఇక మరణమే శరణ్యమని కన్నీరు మున్నీరుగా సాయిని ప్రార్ధించాడు. అతని పరుశుద్ధమైన ప్రార్ధనకు బాబా హృదయం కరిగింది. అపుడు భీమాజీతో సాయి” ఊరుకో. నీ అతృతలను పారద్రోలుము. నీకష్టముల్లనీ గట్టెక్కే సమయం వచ్చింది. ఎంతటి బాధలునవారైనా తల్లి వంటి ఈ మశీదు మెట్లెక్కితే వారి కష్టములనీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీస్తాయి. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయామయుడు. నీ రోగమును తప్పక బాగు చేయును” అని ప్రేమపూర్వక పలుకులను పలికారు. ఆ కమ్మని పలుకులతో భీమాజీకి కొండంత ఊరట కలిగినట్టయ్యింది. అప్పటి వరకూ ప్రతీ అయిదు నిమిషాలకూ రక్తం కక్కుతున్న అతను సాయి సుముఖంలో ఒక్కసారి కూడా రక్తం కక్కలేదు. సాయి వానికి నిన్ను కాపాడుతాను అని దయతో అభయం ఇచ్చినప్పటినుండి భీమాజి జబ్బు నయమవడం ఆరంభించింది. అతనిని భీమాభాయి అను వారి ఇంట వుంచమని సాయి సలహా ఇచ్చారు. ఆ ఇంటికి గాలీ, వెలుతురూ సరిగ్గా వుండక ఏమంత సౌకర్యంగా వుండదు. క్షయ రోగంతో బాధపడు వారికి ఆ ఇల్లు అసలు పనికిరాదు. కాని సాయి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం. ఆ రాత్రి అతనికి రెండు స్వప్నములు వచ్చాయి. మొదటి స్వప్నములో భీమాజి ఒక పాఠశాల విద్యార్ధిగా వున్నాడు. టీచరు చెప్పిన పద్యములను కంఠస్తం చేయకపోవడం వలన టిచరు గారు అతడిని తీవ్రంగా దెబ్బలు కొట్టారు.రెండవ స్వప్నంలోగుర్తు తెలియని వ్యక్తులు కొందరు భీమాజి చాతిపై పెద్ద బండను వేసి కిందకూ, మీదకు తొక్కడం వలన చాతిలో నొప్పి ఎక్కువగా వచ్చి భీమాజీ తీవ్రమైన బాధను అనుభవించాడు. కలలో పడిన ఈ బాధలతో అతని జబ్బు పూర్తిగా నయమైపోయింది. కొద్ది రోజులలోనే శ్రీ సాయి యొక్క ఊదీ ప్రసాదాలను తీసుకొని ఆనందంగా తన బంధువులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. సాయినాధులు తనకు చేసిన ఈ మేలును మరువక ప్రతీ నెలా శ్రీ సాయి సత్య వ్రతం అనే వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకోసాగాడు. ఈ విధంగా శ్రీ సాయినాధుల తమదైన శైలిలో తన భక్తుని వ్యాధిని తగ్గించి వేసారు. సాయి తాను తన భక్తులకు చేసిన మేలుకు ప్రతిఫలముగా ఏమీ ఆశించేవారు కాదు.వార్కి కావలసింది భక్తులు తాము పొందిన మేలును గుర్తుంచుకొని తనపై అచంచలమైన నమ్మకం కలిగి వుండడమే ! తనకు సర్వస్య శరణాగతి చేసిన భీమాజీ యొక్క కిందటి జన్మలో చేసుకున్న ప్రారబ్ద కర్మలను సైతం తప్పించి,మందులు ఆపరేషన్ లు లేకుండా కేవలం స్వప్నానుభవములతో అతి దుర్లభమైన అతని వ్యాధిని తగ్గించి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిని గావించి తదనంతరం సుఖవంతమైన నూతన జీవితం ప్రసాదించిన కరుణా మూర్తి శ్రీ సాయి. సాయి కరుణను, అపారమైన అనుగ్రహమును పొందాలంటే ఆడంబరమైన భజనలు, ఆర్భాటమైన పూజలు, యజ్ఞ యాగాదులు అవసరం లేదు. పరిశుద్ధమైన మనస్సు, ఇచ్చేది, పుచ్చుకునేది ఆ సాయియే అన్న ధృఢమైన నమ్మకం చాలు.
Read Also..
Read Also..
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు లో వింత ఆచారం చోటుచేసుకుంది… గ్రామంలోని శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో శివ స్వామికి భక్తులు కారంతో అభిషేకాలు నిర్వహించారు… శ్రీ ప్రత్యంగిరి దేవి ఉప వాసుకలు ప్రతి ఏటా శివ స్వామీ కి కారంతో అభిషేకాలు చేస్తూ ఉంటారు… ప్రత్యేకించి కార్తీక మాసంలో ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో ప్రత్యేక హోమాలు నిర్వహించి ప్రత్యంగిరి దేవికి ఎంతో ఇష్టమైన 60 కేజీల కారంతో అభిషేక కార్యక్రమాల నిర్వహించారు…ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని.. శివ స్వామికి కారంతో అభిషేకాలు నిర్వహించారు..
ఆయనొక ఏఈఓ … విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద విధులు నిర్వహిస్తూ.. ఆలయానికి వచ్చిన భక్తుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి.
కానీ ఆయన మాత్రం నోరు విప్పితే చాలు పచ్చి బూతులే.. గతంలోనూ పలుమార్లు బూతులు తిడుతూ మీడియాలో వెలుగులోకి వచ్చారు. ఆలయ సన్నిధి వద్ద విధులు నిర్వహించే అర్చకులను సైతం బూతులు తిడుతూ, ఒక ధర్మ కర్తను బూతులు తిడుతూ మాట్లాడిన తీరు పై.. పాలక మండలి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే సదరు ఏఈఓపై భక్తులు మండిపడుతున్నారు. ఇలాంటి వారి పై తక్షణమే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధరణం. నేడు శ్రీవారి దర్శనం కోసం 06 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,874 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం 3.50 కోట్లు. శ్రీవారికి 17,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టోకెన్ లు లేని భక్తులకు 8 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
తిరుపతి అభివృద్దిలో టిటిడి భాగస్వామ్యం ఉండాలని నగరపాలక సంస్ధలోకి నిధులు మళ్ళీంచరాదని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు. టిటిడి నిధులతో తిరుపతి అభివృద్ది అనే అంశం పై నగరంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తిరుపతి అభివృద్ది టిటిడి స్వయం పర్యవేక్షణలో జరగాలని కోరారు. నగర ప్రజలు ప్రేక్షక పాత్ర వహించకుండా అధికార పార్టీ పై ఒత్తిడి తీసుకవచ్చి టిటిడి లో వచ్చే ఉద్యోగ అవకాశాలు పోందాలని, తిరుపతి అభివృద్దికి టిటిడి గరిష్టంగా నిధులు వెచ్చించాలని డిమాండ్ చేశారు. నగరంలోని పలు విద్యాసంస్ధలు, ఆస్పత్రుల ఏర్పాటులో టిటిడి కీలకమని గుర్తు చేశారు. తిరుపతి అభివృద్దికి భాజపా అడ్డంకిగా మారడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
శ్రీశైలం గోశాల గో ఉత్పత్తుల తయారీ కేంద్రంలో రక్త పింజర పాము కలకలం రేపింది. సుమారు 4 అడుగుల రక్త పింజరి పాము కనపడటంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. గో ఉత్పత్తుల తయారీ కేంద్రంలోకి పాము రావడంతో గమనించిన సిబ్బంది, అధికారుల ద్వారా స్నేక్ క్యాచర్ రాజకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన గో ఉత్పత్తి కేంద్రం వద్దకు చేరుకున్న స్నేక్ క్యాచర్ రాజ పామును చాకచక్యంగా పట్టుకుని దట్టమైన అటవీప్రాంతంలో పామును వదిలిపెట్టారు.