గోపం లేక శడగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపంను వెండి , రాగి, కంచుతో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఎందుకుండాలి, నేరుగా పాదాలనే తలపై పెట్టోచ్చు కదా అంటే దానికీ ఒక లెక్క ఉందంటున్నాయి మన శాస్త్రాలు, ఎందుకంటే నేరుగా పదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచడం జరిగిందంట.దాని మీద దేవుని పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శడగోప్యము. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, షడగోప్యం తప్పక తీసుకోవాలి. చాలమంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినపనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి, షడగోప్యం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం. సహజంగా చిల్లర లేకపోవటం వల్ల, షడగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము. ప్రక్కగా వచ్చేస్తాము. అలా చెయ్యొద్దు. పూజారి చేత శడగోప్యము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. శడగోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేయటం వలన శడగోప్యమును తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వార శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. శడగోప్యమును శఠగోపనం అని కూడా అంటారు.శాస్త్రపరంగా చూస్తే శఠగోపం పంచలోహాలతో కాని, ఇత్తడి, వెండి, రాగి, బంగారం, కంచులతో విడివిడిగా గాని తయారు చేస్తారు. వీటన్నిటికీ వేడిని సంగ్రహించే శక్తి ఉంది. అందుకే తలమీద పెట్టగానే తలలో వేడిని ఇది సులువుగా లాగేస్తుంది.
Devotional
మీ జాతకంలో శుక్రదోషం వుంటే తప్పక స్పటిక గణపతిని ప్రతి శుక్రవారం పూజించాలి. శుక్రవార నియమం పాటించాలి. మహిళలకు సహాయకారిగా వుండాలి. చిన్నపిల్లలకు స్వీట్స్ పంచాలి. వితంతువులకు మేలు చేయాలి. ఇక మీ జాతకంలో శుక్రుడు బలహీనము గా ఉన్నప్పుడు స్త్రీలకు అనారోగ్యము కలుగుట. వాహన సౌఖ్యము లేకపోవుట. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట. వ్యసనములకు అలవాటుపడటం, వివాహం ఆలస్యం అవటం, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారంచేయటం, మత్తుపానీయాలు సేవించుట, జూదం ఆడి ఆస్తులు కోల్పోవటం, మహిళలతో తగవులు కుటుంబంలోని స్త్రీలకు అరోగ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషముగా గుర్తించి శుక్ర గ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట, లక్ష్మీ స్తోత్రము పారాయణం చేయుట, బొబ్బర్లు దానం చేయటం, వివాహం కాని స్త్రీలకు వారి వివాహం కొరకు సహకరించుట, స్త్రీలను గౌరవించుట. వజ్రం ఉంగరం ధరించుట, సప్తముఖి రుద్రాక్షను ధరించుట వలన శుక్ర గ్రహ అను గ్రహము పొందవచ్చును.
Read Also..
అత్యంత మహిమాన్వితమైన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము మల్లూరు గ్రామం, మంగపేట మండలము, వరంగల్ జిల్లాలో అందమైన కొండల మధ్య కలదు. ఈ దేవాలయము స్వయంభూ దేవాలయముగా, ఎంతో చారిత్ర కలిగిన దేవాలయముగా ప్రసిధ్ధిగాంచినది. నవ నారసింహ క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. ఇక్కడ స్వామివారు మోండెందాకా నరరూపం, తలభాగం సింహంగా నిజరూపంగా దర్శనమిస్తారు. స్వామివారు మానవ శరీర లక్షణాలు కలిగి మెత్తగా ఉంటారు. ఈ క్షేత్రం 6వ శతాప్ధం నాటికే కలదు. 12వ శతాప్ధంలో కాకతీయులు ఆలయాన్ని పునర్నిమించారు. 17వ శతాప్ధంలో నవాబులు స్వామివారికి 150 కిలోల వెండి కవచం బహూకరించడం జరిగింది. ఈ ప్రాంతాన్ని రావణాసురుడు తన చెల్లెలు శూర్పణఖకు కానుకగా బహూకరించాడని ప్రతీతి. స్వామివారు భారధ్వాజ మహాఋషికి దర్శనమిచ్చి తను ఈ ప్రాంతంలోని గుహలో ఉన్నానని తెలిపారు. స్వామివారు తెలిపినవిధంగా గుహని తొలుస్తూఉంటె స్వమివారి నాభికి దెబ్బతగిలింది. దెబ్బతగిలిన ప్రాంతంనుండి వచ్చే తడిని ఆపడానికి చందనం పెట్టడం జరిగింది. ఈ చందనం సంతానం లేనివారికి, కుజదొషం ఉన్నవారికి మరియు రాహువు, కేతువు గ్రహ దోషానికి ఇస్తారు. కాళసర్ప దోషానికి ఇక్కడ తైలాభిషేకం చేయడం ఇక్కడి ప్రత్యేకతలలో ఒకటి. దక్షిణ భారత దేశంలో మరెక్కడా కూడా నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేయడం జరగదు. కాని ఇక్కడ స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం మరొక ప్రత్యేకత. ఈ ప్రాంతము అర్థచంద్రాకారంలో ఉంటుంది కావున భారధ్వాజ మహాఋషి దీనికి హేమాచలమనే పేరు పెట్టారని ప్రతీతి. ఇక్కడి చింతామణి జలధార నీరు మూత్రపిండ వ్యాదులకు, నడుముకు సంబంధించిన వ్యాదులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ నీరు సంవత్సరాలపాటు నిలువ ఉండే గుణాన్ని కలిగి ఉంది.
Read also..
Read also..
Read also..
ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు. ఈ విషయంపై శివపురాణం ఓసారి తిరగేస్తే.. అందులో శివుడు ఎనిమిది రూపాలు ధరించినట్టు పేర్కొంటోంది. అవేంటంటే…
రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అధిష్టించి ఉంటాడు.
శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు.
భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి ఉంటాడు.
ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడైన వాయువును అధిష్టించి ఉంటాడు.
భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు.
పశుపతి : సంసారబద్ధులైన జీవులను పాపవిముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు.
ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునిలో ప్రకాశిస్తుంటాడు.
మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు.
పూర్వం బ్రహ్మ విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్పని కలహించుకుంటూ ఉండగా, అపుడు వారి మధ్య ఒక శివలింగం పుట్టి బ్రహ్మను, నా శిరస్సు ఎక్కడుందో కనుక్కోవలసిందని; విష్ణువును నా పాదాలేక్కడున్నాయో కనుక్కోవలసిందని ఆదేశించింది. హంసరూపంలో బ్రహ్మ పైకి; ఆదివరాహరూపంలో విష్ణువు క్రిందికి వెళ్లారు. బ్రహ్మకు లింగంశిరస్సు, విష్ణువునకు లింగపాదాలు కన్పించలేదు. మన్వంతరాలు తిరిగిపోయాయి. ఇద్దరూ తిరిగి పోరాడుకున్న స్థలానికే వచ్చారు. విష్ణువు నాకు లింగంపాదాలు కనిపించాలేదన్నాడు. బ్రహ్మ తానూ లింగం శిరస్సు చూచానని; మొగిలిపూవును, కామధేనువును వెంటబెట్టుకొని వచ్చి మొగలిపూవుచేత చూచినట్లు సాక్ష్యం చెప్పించాడు. కామధేనువు నడగ్గా అది తన తోకను అడ్డంగా ఊపి ఇది అబద్ధమని తెలియజేసింది. అప్పుడు విష్ణువు మొగలిపూవు అబద్ధం చెప్పింది కనుక అది పూజకర్హం కాదనీ, కామధేనువు వృష్ఠభాగంతో సత్యం తెలిపింది కనుక ఆవుకు వెనుకభాగం పూజార్హమగుగాక యనిన్నీ శాపం పెట్టాడు. అందువల్ల మొగలి పూవు పూజకర్హం కాకుండా పోయింది. ఆవు వెనుకభాగమే పూజింపబడుతోంది. మల్లె, గులాబీ మొదలైన పూవులు కూడా పూజకనర్హాలే! మల్లె కేవలం అలంకారానికి మాత్రమే!
Read Also..
ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు. వారి పేర్లు సునీతి, సురుచి. రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. పెద్ద భార్య అయిన సునీత పేరుకే రాణి. దాసికన్నా హీనంగా చూసేవాడు. సునీత కొడుకు ధ్రువుడు, ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకొనేవాడు. కాని తండ్రి, పిన తల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ద్రువునికి తండ్రి ప్రేమ కరువైంది. ఒక రోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ద్రువుడ్ని చీదరించుకున్నాడు. తండ్రి నిరాదరణకు ద్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి అయిన సురుచి కఠినంగా “ధ్రువా! నీవు నా కడుపున పుడితే మీ తండ్రిగారి తొడపై కూర్చొనే అదృష్టం కల్గేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీహరిని ప్రార్ధించు. అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది” అన్నది పినతల్లి సురుచి. జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి “నాయనా ధ్రువా! నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి ఫలితం ఉంటుంది” అన్నది తల్లి.
తల్లి మాటలకు ధ్రువుడు సంతోషపడి, తపస్సు చేయుటకు బయలుదేరాడు. దారిలో ద్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలిసుకొని నవ్వుతూ “నాయనా ధ్రువా! పసివాడివి పినతల్లి మాటలకు ఇంత పట్టింపా? తపస్సు అంటే మాటలు కాదు! చాలా కష్టము. నీ నిర్ణయం మార్చుకో” అన్నాడు. నారదుని మాటలకు ధ్రువుడు “మహర్షీ! పినతల్లి మాటలకు నాలో రేపిన బాధ అంత,ఇంత కాదు. ఉత్తముని కన్న నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందడానికి నేను కఠోర తపస్సు చేస్తాను” అని చెప్పాడు. “పట్టుదల గట్టిదే. నిశ్చలమైన మనస్సుతో తపస్సు చెయ్యి” అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి, దీక్షతో కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలను స్తుతించాడు. అంతట విష్ణుమూర్తి “ధ్రువా! నీ మనస్సునందున్న కోరిక నెరవేరుస్తున్నాను. ఇంత వరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ, సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై, ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని ‘ధ్రువ నక్షత్రం’ అని పిలుస్తారు” అని వరమిచ్చి అంతర్దానమైనాడు. నేటికీ కనబడే ఉత్తర ద్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువనక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి, అనుకున్నది సాధించాడు. పట్టుదల ధృడ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించ వచ్చు అని మనందరం తెలుసుకోవాలి.
మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని. ఈ వృత్తాంతం మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది. మార్కండేయుడు ఆరు మన్వంతరములు తపస్సు చేశాడు. ఏడో మన్వంతరములో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు. వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు. చలించని మార్కండేయునికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ‘ఏం వరం కావాలో కోరుకో’అనగా‘నీ మాయను చూడాలని ఉంది’అని అడుగుతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రచండ గాలీ, ధారాపాత వర్షమూ విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి. నీటి తో సమస్తం మునిగిపోతుంది. మార్కండేయుడు మోహశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు. అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రిఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. చేతి వ్రేళ్ళతో కాలిని పట్టుకుని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు. అతడే వటపత్రశాయి. మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపై నున్న వటపత్రశాయి కడుపులోకెళ్లి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమీ, ప్రాణ కోటి కనిపిస్తుంది. మళ్ళీ మరోచోట సృష్టి ప్రారంభము చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు. శ్రీమాహావిష్ణువు వరం ప్రకారం విష్ణు మాయను తెలుసుకుంటాడు.
“ప్రదక్షిణం”లో ‘ప్ర‘అనే అక్షరము పాపాలకి నాశనము…‘ద‘అనగా కోరికలు తీర్చమని,‘క్షి‘అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. ‘ణ‘అనగా అజ్ఞానము ప్రారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్నీ వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం.
అఖిలాంఢకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయినా శ్రీ సాయినాధుని లోని విశిష్ట ఏమిటంటే కల్పవృక్షం, కామధేనువు కంటే భిన్నంగా అడిగినవారికీ, అడగనివారికీ కూడా వారికి నిత్య జాగృతుడై, కావల్సినవన్నింటినీ సమకూర్చి, మొదట వారి భౌతిక అవసరాలను తీర్చి, పిమ్మట వారిని అధ్యాత్మిక మార్గంలో పయనింపజేస్తారు. అంతే కాక మొదటి నుండి వారి వెంట వుండి,వారిని దారి తప్పకుండా మార్గ దర్శి వలే నిలిచి,చివరికంటా గమ్యం చేరుస్తారు. తనకు సర్వస్య శరణాగతి చేసిన భక్తులకు ఎళ్ళవేళలా రక్షణ కవచాన్ని అందిస్తూ వారికి ముక్తిని ప్రసాదించే అతి శక్తివంతుడు, ఆర్తత్రాణ పరాయణుడు శ్రీసాయినాధులు.
శ్రీమహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడిచేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీమహావిష్ణువుపై ఉంచాడు. శ్రీవృక్షమనే పేరుతో కూడా పిలిచే బిల్వ వృక్షంనుదేవతలు స్వర్గంలోనూ, మందార పర్వతం పైనా, వైకుంఠంలోనూ నాటారు. శివుని కిష్టమైన ఈ బిల్వ వృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి. ఎండినా, కోసి రెండు మూడు రోజులైనా శివ పూజకు వాడకూడదు. బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వ వృక్ష పత్రం లక్ష బంగారు పూవులతో సమానం.
Read Also..





Total views : 91124