Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News కర్ణాటకలో వింత ప్రేమ వివాహం..

కర్ణాటకలో వింత ప్రేమ వివాహం..

by CVR NEWS
కర్ణాటకలో వింత ప్రేమ వివాహం

ప్రేమకు కళ్లు లేవు.. కులమతాలు తెలియవు.. అంతవరకు బాగానే ఉంది కానీ.. కనీసం రక్తం పంచుకున్న వరుసలైనా గుర్తుండవా? అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది ఓ కన్నతల్లి. నిశ్చితార్థం ముగిసి, పెళ్లి పత్రికలు పంచేసి, మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు.. వరుసకు తమ్ముడయ్యే సొంత పిన్ని కొడుకుతో లేచిపోయి పెళ్లి చేసుకున్న వింత ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూడు సంవత్సరాల ప్రేమ కోసం కట్టుబాట్లను, రక్తసంబంధాలను కాలరాస్తూ ఈ జంట ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి రక్షణ కల్పించాలంటూ కోరడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.

బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లి తాలూకా సావకనహళ్లి గ్రామానికి చెందిన శశికల, హోస్కోట్ తాలూకాకు చెందిన ప్రవీణ్ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరిద్దరి తల్లులు స్వయానా అక్కాచెల్లెళ్లు. అంటే వరుసకు శశికల అక్క, ప్రవీణ్ తమ్ముడు అవుతారు. ఈ విషయం తెలిసి ఇరువైపులా పెద్దలు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. సమాజం ఒప్పుకోని ఈ బంధాన్ని వద్దంటూ వారించారు.ఈ క్రమంలోనే శశికల తల్లిదండ్రులు ఆమెకు మరో యువకుడితో వివాహం నిశ్చయించి.. లగ్నపత్రికలు కూడా పంచారు.

ఇంకేముంది పెళ్లికి అంతా సిద్ధమైంది అనగా.. శశికల తన ప్రియుడు ప్రవీణ్‌తో కలిసి ఊరు వదిలి పారిపోయింది. అనంతరం స్థానిక అంగట్ట ప్రాంతంలోని ఒక శివాలయంలో ఇద్దరూ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత తమ తల్లిదండ్రుల నుండి ప్రాణభయం ఉందంటూ ఈ నూతన వధూవరులు చిక్కబళ్లాపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని రక్షణ కోరారు. ప్రస్తుతం సామాజిక కట్టుబాట్లను సవాల్ చేసిన ఈ వింత పెళ్లి వ్యవహారం కన్నడ నాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: