శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలోని జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ వద్ద మధ్యాహ్నం భోజనం సరిగా వడ్డించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. పాఠశాలో దాదాపు 400 మంది విద్యార్థులు ఉండగా.. 150 మంది దాకా విద్యార్థులు ఇంటి నుంచి రోజూ బాక్సులు తీసుకొచ్చి తింటున్నారు. మధ్యాహ్న భోజనం చాలీచాలకుండా పురుగులు పడిన అన్నం వడ్డిస్తున్నారని.. అందుకే ఇంటినుంచి భోజనం తెస్తున్నామని విద్యార్థులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం మెనూ ప్రకారం కూరగాయల అన్నం, కుర్మా వడ్డించాలి. అయితే ముద్దముద్దగా అన్నం, నీళ్ల సాంబార్ లాగా కురుమ ఉండడంతో విద్యార్థులు తినకుండా చెత్తబుట్టలోకి వేయడం బాధాకరం. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ స్కూల్ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించడం లేదని విద్యార్థులు వాపోతూన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని వారు కోరారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొత్తగూడెం మేయర్‌గా ఎన్నికైన CPI అభ్యర్థి గణేష్కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని.. CPI MLA కూనమనేని సాంబశివరావు అన్నారు. మేయర్‌గా ఎన్నికైన గణేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఒప్పందంలో భాగంగా మొదటి రెండున్నరేళ్లు తాము మేయర్ పీఠంలో ఉండామని వెల్లడించారు. పేదల…
- శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలుశ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించిన లింగోద్భవ దర్శనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి దంపతులు, దేవస్థానం…
- పెద్దపల్లి జిల్లాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గంపెద్దపల్లి జిల్లాలో కొత్త పాలకవర్గం నేడు కొలువుదీరనుంది. రామగుండం మేయర్, పెద్దపల్లి , మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే పోటీ తీవ్రంగా నెలకొనడంతో సుల్తానాబాద్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను…
- మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలుమున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మేడ్చల్‌లో డబ్బులు తిరిగివ్వమని అడిగిన అభ్యర్థి భర్తపై తిరగబడ్డారు ఓటర్లు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం19వ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి…
- ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి