Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Latest News మరణంలోనూ వీడని వృద్ధ దంపతుల బంధం..

మరణంలోనూ వీడని వృద్ధ దంపతుల బంధం..

by CVR NEWS
మరణంలోనూ వీడని వృద్ధ దంపతుల బంధం

దశాబ్దాల కాలం పాటు ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఆఖరి శ్వాస వరకు వెంటే ఉంటామని బాసలు చేసుకున్న ఆ వృద్ధ దంపతులు మరణంలోనూ జంటగానే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హుంన్సా గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కన్నీటి పర్యంతం చేస్తోంది. గ్రామానికి చెందిన బాదే సిద్దయ్య గురువారం వేకువజామున నిద్రలోనే కన్నుమూశారు. ప్రాణ సమానమైన భర్త మరణాన్ని ఆయన భార్య తట్టుకోలేకపోయారు. పుట్టెడు దుఃఖంతో మనస్తాపానికి గురైన ఆమె, ఆరోగ్యం క్షీణించడంతో భర్త చనిపోయిన మరుసటి రోజే శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి అపురూప అనుబంధాన్ని చూసి గ్రామస్థులు బోరున విలపిస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039868
Total views : 201115

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: