తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతోంది. ఆ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఈ జలపాతం ఉంది. ఎగువన చతిస్గడ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండలు కోనల వాగులు, వంకలు నడుమ పొంగిపొర్లుతున్నాయి.బొగత జలపాతం సరికొత్త అందాలతో.. ఈ క్రమంలో బొగత జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది.దట్టమైన అడవిలో జలపాతం సవ్వడులు వీనుల విందు చేస్తున్నాయి. బొగత జలపాతం సరికొత్త అందాలతో అలరిస్తోంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. రద్దీ బాగా పెరిగిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, యువతీ యువకులు పిల్లా పాపలతో పెద్ద సంఖ్యలో వస్తున్నారు,సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంటే పర్యాటకులు కేరింతలు కొడుతూ సెల్ఫీలతో ఫోటోలు దిగుతు ఎంజాయ్ చేస్తున్నారు దిగువకు చేరిన నీటిలో జలకాలాడుతూ నీళ్లలో నుంచి బయటికి రావాలనిపించడంలేదు అని చెప్తున్నారు కొంత మంది సరదాగా గడుపుతున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, అలాగే మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. వేలాది మంది పర్యాటకులతో జలపాతం పరిసర ప్రాంతాలు సందడిగా మారింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.