రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్‌గా హిమాన్ష్ శుక్లాను ప్రభుత్వం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత అప్పటి వరకూ కమీషనర్‌గా ఉన్న విజయ్‌కుమార్‌రెడ్డి చెప్పాపెట్టకుండా పరార్ అయ్యారు. అప్పటి నుంచి సమాచారశాఖ కమీషనర్‌గా ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. అయితే ఈరోజు పలువురు ఐఏఎస్‌లను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా సమాచార శాఖకు శుక్లాను డైరెక్టర్‌గా నియమించింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సమాచారశాఖ వైసీపీ కార్యాలయంగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో అప్పటి కమీషనర్ నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డారని, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణలో గత ఐదేళ్ల అక్రమాలను ప్రభుత్వం బయటకు తెస్తుందని, అదే సమయంలో గత కమీషనర్ అక్రమాలకు సహకరించిన వారందరిపై కూడా విచారణ జరుగుతుందంటున్నారు.సమాచారశాఖ డైరెక్టర్‌గా నియమితులైన శుక్లాకు నిజాయితీపరుడైన అధికారిగా పేరుంది. నేరుగా ఐఏఎస్‌కు ఎంపికైన శుక్లా సమాచార శాఖను గాడిలో పెడతారని, అక్రమార్కుల భరతం పడతారనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం యువ ఐఏఎస్ కు సమాచార శాఖ బాధ్యతలు అప్పచెప్పింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి