Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Sports కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో హైదరాబాద్ ఓటమి..!

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో హైదరాబాద్ ఓటమి..!

by Satya
Hyderabad defeated by Kolkata Knight Riders

IPL 2024 match :

ఐపీఎల్-17ను సన్‌రైజర్స్ హైదరాబాద్(Hyderabad) ఓటమితో మొదలుపెట్టింది. కోల్‌కతా వేదికగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(Kolkata Knight Riders) చేతిలో 4 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 208/7 స్కోరు చేసింది. రస్సెల్(64 నాటౌట్, 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(54) హాఫ్ సెంచరీతో మెరిశాడు. రమన్‌దీప్(35), రింకు సింగ్(23) విలువైన పరుగులు జోడించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్(3/32) సత్తాచాటాడు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 204/7 స్కోరుకే పరిమితమైంది. జట్టును గెలిపించేందుకు క్లాసెన్(63, 29 బంతుల్లో 8 సిక్స్‌లు) చేసిన పోరాటం వృథా అయ్యింది. హాఫ్ సెంచరీతోపాటు 2 వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన రస్సెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: సొంతగడ్డపై అదరగొట్టిన రోహిత్ శర్మ


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మంగళగిరిలో మెగా ఫ్యాన్ పార్క్
మంగళగిరిలో ఐపీఎల్ లైవ్ అనుభూతిని పంచేందుకు 'మెగా ఫ్యాన్ పార్క్' సిద్ధమైందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ …
కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయం..
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై రాజస్థాన్ …
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖితమైంది.
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖితమైంది. బ్రెజిల్ మహిళల జట్టు కెప్టెన్ లారా కార్డోసో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009340
Total views : 61776

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.