Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home International ఇంధన మార్కెట్ స్థిరత్వానికి అమెరికా కీలక నిర్ణయం..

ఇంధన మార్కెట్ స్థిరత్వానికి అమెరికా కీలక నిర్ణయం..

by CVR NEWS
ఇంధన మార్కెట్ స్థిరత్వానికి అమెరికా కీలక నిర్ణయం

ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా నెలకొన్న సంక్షోభం వేళ అమెరికా భారత్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రెండో దశ దాడులకు రంగం సిద్ధమవుతున్న క్రమంలో, అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తకుండా ఇంధన మార్కెట్ స్థిరత్వానికి అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 17 వరకు అంతర్జాతీయ మార్కెట్ నుండి రష్యా క్రూడాయిల్‌ను కొనుగోలు చేసుకోవచ్చని ప్రపంచ దేశాలకు వైట్ హౌస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటివరకు రష్యాపై గతంలో విధించిన ఆర్థిక ఆంక్షల నుంచి పూర్తి మినహాయింపు ఉంటుందని యుఎస్ ఫైనాన్స్ మినిస్టర్ స్కాట్ అధికారికంగా ప్రకటించారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల వేళ.. ఇంధన ధరలు ఆకాశాన్నంటకుండా నిరోధించేందుకు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం, రష్యా నుండి భారీగా చమురు దిగుమతి చేసుకునే భారతదేశానికి ఒక పెద్ద శుభవార్తగా, ఊరటగా మారింది.
()అమెరికా ప్రకటించిన ఈ తాజా మినహాయింపులతో రష్యా నుంచి తక్కువ ధరకే ఆయిల్ కొనుగోళ్లను భారత్ మరింత భారీగా పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలు, అమెరికా ఆంక్షలతో సంబంధం లేకుండా ..తాము దేశీయ ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నామని భారత ప్రభుత్వం నిన్ననే స్పష్టం చేయడం గమనార్హం. ఏదేమైనప్పటికీ, ఇరాన్ పరిణామాల నేపథ్యంలో చమురు ధరలు పెరగకుండా అమెరికా ఇచ్చిన ఈ వెసులుబాటు.. అటు భారత ఆర్థిక వ్యవస్థకు, ఇటు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండేందుకు ఎంతగానో దోహదపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039855
Total views : 201046

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: