Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home International హాట్ టాపిక్ గా మారిన ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..

హాట్ టాపిక్ గా మారిన ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..

by CVR NEWS
హాట్ టాపిక్ గా మారిన ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇజ్రాయెల్‌లో తనకు విశేష ప్రజాదరణ ఉందని, భవిష్యత్తులో అక్కడ ప్రధాని పదవికి పోటీ చేసే అవకాశం ఉందంటూ ఆయన చమత్కరించారు. మరోవైపు, ఇజ్రాయెల్‌లో ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఇజ్రాయెల్ రాజకీయాలపై ట్రంప్ సరదా వ్యాఖ్యలు చేశారు.ఇజ్రాయెల్‌లో తనకు 99 శాతం అప్రూవల్ రేటింగ్ ఉందంటూ తెలిపారు. అమెరికాలో పదవీ కాలం ముగిశాక, ఇజ్రాయెల్ లో ప్రధాని పదవికి పోటీ చేయవచ్చేమో!’ అని ఆయన నవ్వుతూ అన్నారు. అలాగే ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును చాలా మంచి వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన తరుణంలోనే, ఇజ్రాయెల్ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం నెలకొన్నదని అంతర్జాతీయంగా ప్రచారం జరుగుతోంది. గత 17 ఏళ్లలో ఎక్కువ భాగం అధికారంలో ఉన్న నెతన్యాహుకు ఇప్పుడు సొంత కూటమి నుంచే సెగ తగులుతోంది. సైనిక నియామక మినహాయింపుల విషయంలో నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక మిత్రపక్షమైన ‘అల్ట్రా-ఆర్థోడాక్స్’ మతపరమైన పార్టీలు మద్దతు ఉపసంహరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దుకు ఉద్దేశించిన ప్రాథమిక బిల్లు ఇప్పటికే ఆమోదం పొందింది. అక్టోబర్ 7, 2023 నాటి హమాస్ దాడుల తర్వాత భద్రతా వైఫల్యాలపై నెతన్యాహు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు తాజా రాజకీయ పరిణామాలు ఆయనకు అతిపెద్ద ముప్పుగా మారాయి. ఈ బిల్లుకు పూర్తి ఆమోదం లభిస్తే, ఈ ఏడాది చివర్లో ఇజ్రాయెల్‌లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Advertisements

You may also like

Our Visitor

039742
Total views : 200459

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: