Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News డబ్బులెవరికీ ఊరికే రావు..

డబ్బులెవరికీ ఊరికే రావు..

by CVR NEWS

డబ్బులెవరికీ ఊరికే రావు. లలితా జువెల్లర్స్ అధినేత కిరణ్‌ మొదట ఈ మాటలు అన్నప్పుడు అంతా దీన్ని పాజిటివ్‌గా తీసుకున్నారు. నిజమే కదా.. కష్టపడందే ఎవరికీ డబ్బులు రావు అని అనుకున్నారు. కానీ ఆయన మాటల వెనుక అసలు అంతరార్థం ఏంటన్నది… ఇప్పుడిప్పుడే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది. డబ్బులు ఎవరికీ ఊరికే రావు… తప్పుడు ప్రకటనలు చేసి, స్కీముల పేరుతో మభ్యపెట్టి, కస్టమర్లను బురిడీ కొట్టిస్తేనే కోట్లకు కోట్లు గడించొచ్చు… ఊరూరా బ్రాంచీలు ఏర్పాటు చేయొచ్చు అని కిరణ్ కుమార్‌ చాటిచెబుతున్నారు. వ్యాపారం చేయడం తప్పు కాదు. కానీ దాని కోసం అడ్డదారులు తొక్కడం, కల్లబొల్లి మాటలు చెప్పి కస్టమర్లను వంచించడం తప్పు. దురదృష్టవశాత్తు లలితా జువెల్లర్స్‌ చేస్తున్నది అదే. 11 నెలల గోల్డ్‌ స్కీమ్ పేరుతో ఎలాంటి గ్యారంటీ లేని ఓ పథకాన్ని తీసుకొచ్చి… నెలకు కోట్లాది రూపాయలు వెనకేసుకుంటోంది లలిత జువెల్లర్స్‌..

11 నెలల పాటు కస్టమర్ల డబ్బును పెట్టుబడిగా పెట్టుకుని… వ్యాపారాన్ని ఊరూరా విస్తరిస్తోంది. దీని వల్ల ప్రజలు నష్టపోవడంతో పాటు… ఇంతకాలం స్వర్ణకార వృత్తినే నమ్ముకున్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. పైపై మెరుగులు చూపించి కస్టమర్లను నిండా మోసం చేస్తున్నారని… తరుగు, మజూరీ లేదంటూ.. అంతకు మించి డబ్బులను నొక్కేస్తున్నారని.. ఈ వృత్తిలో తలపండిన స్వర్ణకారులు చెబుతున్నారు. సామాన్య ప్రజలు ఈ మోసాన్ని అర్థం చేసుకోలేక లలిత జువెల్లర్స్‌ ఉచ్చులో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలని.. ఇలాంటి మోసపూరిత స్కీముల మాయ నుంచి బయటపడాలని స్వర్ణకారులు సూచిస్తున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా కళ్లెదుటే జరుగుతున్న ఈ మోసాన్ని అరికట్టి.. లలితా జువెల్లరీస్‌ లాంటి సంస్థలను కట్టడి చేయాలని కోరుతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: