Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home National మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

by Satya
మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అస్థిరంగా ఉందని, పూర్తికాలం అధికారంలో కొనసాగకపోవచ్చునని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముంబైకి వచ్చిన ఆమె శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేలతో భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల తర్వాత వీరితో భేటీ కావడం ఇదే మొదటిసారి. భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ఆట ఇప్పుడే మొదలైందన్నారు.
జూన్ 25వ తేదీని ప్రధాని మోదీ రాజ్యాంగ హత్యాదినంగా ప్రకటించడంపై కూడా ఆమె స్పందించారు. తాము ఎమర్జెన్సీకి వ్యతిరేకమని మోదీ హయాంలోనే అత్యయిక పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శించారు. మూడు కొత్త నేర న్యాయ బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు ఎవరినీ సంప్రదించలేదన్నారు. పెద్ద సంఖ్యలో ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన సమయంలో వాటిని ఆమోదించారని ఆరోపించారు. కొత్త చట్టాల విషయంలో చాలామందిలో ఆందోళన నెలకొంది అంటూ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసారు .
పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్‌తో పోరాడి తాము అధికారంలోకి వచ్చామని ఈ నేపథ్యంలో అక్కడ సీపీఎంతో సర్దుబాటు సాధ్యం కాదని స్పష్టం చేశారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే పార్టీ తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించిందన్నారు. ఇదే ఉత్సాహంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నాయన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

018635
Total views : 89056

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.