Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana NTPC: ఎన్టీపీసీ ను నేడు జాతికి అంకితం చేయనున్న మోదీ.

NTPC: ఎన్టీపీసీ ను నేడు జాతికి అంకితం చేయనున్న మోదీ.

by Prakash
NTPC

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ(NTPC)

ఎన్టీపీసీ పరిధిలోని తెలంగాణ ప్రాజెక్టు సంబంధించిన రెండవ దశ 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని దేశ ప్రధాని ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు. కాగా ఇటీవలే ఈ యూనిట్ ను అధికారులు వాణిజ్యపరంగా ఉత్పత్తిలోకి తీసుకువచ్చారు. అనంతరం ఈరోజు ఆదిలాబాద్ లో పర్యటించనున్న ప్రధాని వర్చువల్ విధానం ద్వారా ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు పనులు 2016 లో ప్రధాని మోదీ ప్రారంభించగా. మొదటి దశ 800 యూనిట్ ను 2023 అక్టోబర్ లో ప్రారంభించారు. అనంతరం తాజాగా రెండో యూనిట్ ప్రారంభించడానికి ఈరోజు ముహూర్తం ఖరారు. ఈ సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ పెర్మనెంట్ టౌన్ షిప్ లోని కాకతీయ ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక స్క్రీన్ లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈరోజు 10:30 కు ప్రదాని మోదీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీపీసీ సంస్థ 10,598 కోట్లతో తెలంగాణ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా 1600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుత్ కేంద్రాలను నిర్మించారు. రెండో దశలో మరో 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..
ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు రచనా …
ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..
డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి, మెమరీ మేకర్స్ బ్యానర్ మీద ‘ది …
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..
అర్ధరాత్రి వేళ నిర్మానుష్య ప్రాంతంలో మంటల్లో చిక్కుకున్న ఓ కారు… మొదట అది సాధారణ ప్రమాదంగా …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

018610
Total views : 89016

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.