Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన మహిళ తన కుమారుడితో హైదరాబాద్ నుంచి బయలుదేరి సామర్లకోట రైల్వే స్టేషన్ కు వచ్చారు…

కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన మహిళ తన కుమారుడితో హైదరాబాద్ నుంచి బయలుదేరి సామర్లకోట రైల్వే స్టేషన్ కు వచ్చారు…

by CVR NEWS

కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన మహిళ తన కుమారుడితో హైదరాబాద్ నుంచి బయలుదేరి సామర్లకోట రైల్వే స్టేషన్ కు వచ్చారు. అయితే ఆమె సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి వారి స్వగ్రామం జగ్గంపేటకు ఆటోలో బయలుదేరి గమ్యస్థానమైన జగ్గంపేట చేరుకున్నారు. అయితే ఇదిలా ఉండగా వారు ఆటో దిగి కొంత దూరం వచ్చిన తర్వాత ఆటోలో వారి యొక్క బ్యాగు మర్చిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ బ్యాగ్ లో దుస్తులతో పాటు సుమారు నాలుగు లక్షల 50 వేలు విలువగల 34 గ్రాములు బంగారు వస్తువులు ఉండడంతో ఆమె జగ్గంపేట పోలీసులను ఆశ్రయించారు. దీనిపై తక్షణం స్పందించి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఆటో ఆచూకీ కోసం రంగంలోకి దిగారు. జగ్గంపేట పోలీస్ స్టేషన్ లోని సిసి ఫుటేజ్,ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సీసీ కెమెరాలు,దేవి సెంటర్లోని సీసీ కెమెరాలు, కాకినాడ రోడ్ లోని కాట్రావులపల్లి గ్రామంలో ఉన్న ప్రధాన సీసీ కెమెరాల ఫుటేజ్ లను క్షుణ్ణంగా పరిశీలించి,సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆటోను గుర్తించారు.
కేవలం మూడు గంటల వ్యవధిలో కేసును చేదించి, ఆటోలో ఉన్నటువంటి ఆ బ్యాగును,బ్యాగ్ లోని విలువైన బంగారం వస్తువులను ఆ యొక్క మహిళకు జగ్గంపేట పోలీసులు అప్పగించారు. దీంతో గంటల వ్యవధిలో పోగొట్టుకున్న బంగారం తిరిగి దక్కించుకోవడంతో ఆ మహిళ హర్షం వ్యక్తం చేస్తూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: