Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home International నేడు పాకిస్తాన్ లో ఇరాన్-అమెరికా మధ్య చర్చలు..

నేడు పాకిస్తాన్ లో ఇరాన్-అమెరికా మధ్య చర్చలు..

by CVR NEWS

పాకిస్థాన్‌లో అమెరికా- ఇరాన్‌ మధ్య శాంతి చర్చలకు సంబంధించి నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఇరాన్‌ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు చేరుకొంది. వీరికి పాక్‌ అధికారులు స్వాగతం పలికారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ , పార్లమెంటు స్పీకర్‌ మొహమ్మద్‌ బాఘర్‌ ఘాలిబఫ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శాంతి చర్చల్లో పాల్గొననుంది. అయితే, ముందస్తు షరతులకు యూఎస్ అంగీకరిస్తేనే.. చర్చలు ముందుకుసాగుతాయని ఇరాన్‌ మీడియా స్పష్టం చేసింది. రక్షణ మండలి కార్యదర్శి, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సహా పలువురు సీనియర్‌ రాజకీయ, సైనిక నాయకులు కూడా ఈ బృందంలో ఉన్నారు. ఫ్లైట్‌ రాడర్‌24 ప్రకారం.. ఇరాన్‌ ప్రభుత్వానికి చెందిన రెండు విమానాలు ఇస్లామాబాద్‌లోని విమానాశ్రయంలో దిగాయని పేర్కొంది. ఇరాన్‌ ప్రతినిధుల రాకను పాక్‌ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. పాక్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌, ఆ దేశ ఆర్మీచీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ ఇతర పాక్‌ అధికారులు వీరికి స్వాగతం పలికినట్లు తెలిపింది. ఇరాన్‌ ఇస్లామాబాద్‌కు చేరుకున్నప్పటికీ.. చర్చలు ముందుకుసాగేందుకు పలు షరతులు విధించింది. ఏ కాల్పుల విరమణ అయినా లెబనాన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఆంక్షల పేరుతో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని పేర్కొంది.

Advertisements

You may also like

Our Visitor

014988
Total views : 81434

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.