Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

by CVR NEWS
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఇంధన పొదుపును పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుకు ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. సీఎం రేఖాగుప్తా ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను గురువారం ప్రకటించారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి రెండ్రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిబంధన రేపటి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. అలాగే ఇంధనాన్ని పొదుపుచేసుకున్న చర్యల్లో భాగంగా ప్రతీ సోమవారం.. మండే మెట్రో నియమాన్ని పాటించాలని సూచించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులంతా తమ సొంత వాహనాలను వదిలి తప్పనిసరిగా మెట్రోలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలు కూడా వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని విజ్ఞప్తి చేసింది. కొత్తవాహనాల కొనుగోళ్లపై ఆరునెలల వరకూ నిషేధం విధించింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును నిలిపివేశారు. ఇక ఏడాది కాలంపాటు మంత్రులు, అధికారులు ఎవరూ విదేశీ పర్యటనలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: