Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home National సిక్కింలో ప్రధాని మోదీ పర్యటన..

సిక్కింలో ప్రధాని మోదీ పర్యటన..

by CVR NEWS
సిక్కింలో ప్రధాని మోదీ పర్యటన

సిక్కింలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సిక్కిం స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఆయన, రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించారు. రూ.4 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, సిక్కింను భారత తూర్పు ప్రాంత స్వర్గంగా అభివర్ణించారు. అలాగే ఆర్కిడ్ మ్యూజియం ఎంతో అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సిక్కిం పర్యటనలో భాగంగా సరదాగా ఫుట్‌బాల్ ఆడుతూ ఆకట్టుకున్నారు. సిక్కిం 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో ఉన్న ఆయన, స్థానిక క్రీడాకారులు, యువ మిత్రులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, యువతతో కలిసి ఆడటం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. స్పోర్ట్స్ దుస్తుల్లో పిల్లలతో కలిసి ఆనందంగా ఫుట్‌బాల్ ఆడుతున్న ప్రధాని ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

009331
Total views : 61536

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.