ఖమ్మం జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టించారు పెనుబల్లి పోలీసులు. రెండు రాష్ట్రాల్లోని రైతులను బెంబేలెత్తిస్తున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఐపీఎస్ ఈ ముఠాకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి కాపర్ తీగలను ఎత్తుకెళ్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 50 కేసుల్లో వీరికి సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. వీరి వద్ద నుంచి దాదాపు 204 కేజీల కాపర్ తీగలతో పాటు రెండు మోటార్ సైకిళ్లు, విద్యుత్ మోటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుళ్లు నాగేందర్, సత్యంలను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. నిందితులను కోర్టుకు తరలించి రిమాండ్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
175
previous post




Total views : 202774