Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Latest News హైదరాబాద్‌లో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో బండారు దత్తాత్రేయ భేటీ..

హైదరాబాద్‌లో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో బండారు దత్తాత్రేయ భేటీ..

by CVR NEWS
హైదరాబాద్‌లో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో బండారు దత్తాత్రేయ భేటీ..

హైదరాబాద్ లోక్ భవన్‌లో ఇద్దరు హేమాహేమీల భేటీ ఆసక్తికరంగా మారింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో దేశానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంశంపై రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షత వహించిన కమిటీ నివేదికను ఇప్పటికే భారత రాష్ట్రపతికి సమర్పించామని, ప్రస్తుతం ఆ నివేదిక పార్లమెంట్ పరిశీలనలో భాగంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వద్ద ఉందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు తమ మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దత్తాత్రేయ ఆరోగ్య పరిస్థితిని, ఆయన దినచర్యను అడిగి తెలుసుకున్న కోవింద్.. ఆప్యాయంగా పలకరించారు. ఇరు నేతల మధ్య జరిగిన ఈ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisements

You may also like

Our Visitor

039958
Total views : 202736

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: