Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home International ఇరాన్‌ పై డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు…

ఇరాన్‌ పై డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు…

by CVR NEWS
ఇరాన్‌ పై డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పతనం అంచున ఉన్నట్లు ఇరాన్‌ తమకు తెలియజేసిందన్నారు. వీలైనంత త్వరగా హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనాన్ని ముగించాలని తమను కోరినట్లు ‘ట్రూత్‌ సోషల్’ వేదికగా పోస్టు పెట్టారు. ఇరాన్‌ తన నాయకత్వాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఉందన్నారు. అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్‌ ప్రభుత్వంలో ఉన్న అంతర్గత విభేదాలను వాళ్లు పరిష్కరించుకోవాలని ట్రంప్‌ సూచించారు. అయితే, ఇరాన్‌ నుంచి ఈ విషయాన్ని ఎవరు చెప్పారనే వివరాలు ట్రంప్‌ వెల్లడించలేదు. సంభాషణ నేరుగా జరిగిందా? లేక మధ్యవర్తి ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారా? అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై వైట్‌హౌస్‌ కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

Advertisements

You may also like

Our Visitor

039941
Total views : 202654

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: