అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై సైనిక చర్యలు నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో సీనియర్ సభ్యుడైన న్యూయార్క్ డెమోక్రటిక్ ప్రతినిధి గ్రెగొరీ మీక్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 215 మంది అనుకూలంగా.. 208 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అనవసర, భారీ ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రతినిధుల సభలో నిర్వహించిన ఓటింగ్‌లో నలుగురు రిపబ్లికన్లు ట్రంప్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధికారికంగా యుద్ధం ప్రకటిస్తేనో, సైనిక చర్యలకు ఆమోదం ఇస్తే తప్ప.. అమెరికా బలగాలు ఇరాన్ పై ఎలాంటి దూకుడు చర్యలకు దిగకూడదని ఈ తీర్మానం ట్రంప్‌ను ఆదేశిచింది. కాగా…పశ్చిమాసియాలో ఘర్షణలు, వైమానిక దాడులు కొనసాగుతున్నప్పటికీ.. కాల్పుల విరమణ అమల్లోనే ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ దాడుల్లో అమెరికా సైనికులు మరణిస్తే.. ఆ కాల్పుల విరమణను ముగించే విషయాన్ని పరిశీలిస్తానని ట్రంప్ తన సలహాదారులతో పేర్కొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
#డొనాల్డ్ట్రంప్ #అమెరికా #ఇరాన్ #అంతర్జాతీయరాజకీయాలు #ఉద్రిక్తతలు #విదేశాంగపాలసీ #ప్రపంచభద్రత
ఇరాన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పతనం అంచున ఉన్నట్లు ఇరాన్ తమకు తెలియజేసిందన్నారు. వీలైనంత త్వరగా హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని ముగించాలని తమను కోరినట్లు ‘ట్రూత్ సోషల్’ వేదికగా పోస్టు పెట్టారు. ఇరాన్ తన నాయకత్వాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఉందన్నారు. అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో ఉన్న అంతర్గత విభేదాలను వాళ్లు పరిష్కరించుకోవాలని ట్రంప్ సూచించారు. అయితే, ఇరాన్ నుంచి ఈ విషయాన్ని ఎవరు చెప్పారనే వివరాలు ట్రంప్ వెల్లడించలేదు. సంభాషణ నేరుగా జరిగిందా? లేక మధ్యవర్తి ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారా? అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై వైట్‌హౌస్ కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన,యుద్ధంలో అణ్వాయుధాలు వాడబోమని సృష్టం చేసిన ట్రంప్..
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించే ఉద్దేశం తనకు లేదని వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ స్పష్టం చేశారు. అణ్వాయుధాలు ఎందుకు వాడాలి..? సంప్రదాయ యుద్ధ పద్ధతుల్లోనే మేము వారిని ఎదుర్కొంటున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. అణ్వాయుధాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని తెలిపారు.అదే సమయంలో టెహ్రాన్‌తో ఒప్పందంపై హెచ్చరికలు జారీ చేస్తూ.. సమయం మించిపోతోందని అన్నారు. అయితే త్వరిత పరిష్కారం కంటే దీర్ఘకాలిక, స్థిరమైన ఒప్పందంపైనే తమ దృష్టి ఉందని పేర్కొన్నారు.





Total views : 202709