హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉదయం లెక్కింపు మొదలైనప్పటి నుంచి అధికార బీజేపీ – కాంగ్రెస్ ల మధ్య గట్టిపోటీనే కనిపించింది. మధ్యలో బీజేపీ అనూహ్యంగా లీడ్ లోకి వచ్చింది. బీజేపీ 49, కాంగ్రెస్ 35 స్థానాల్లో లీడింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ లీడ్ లో లేకపోయినా హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ గర్హి సంప్లా కిలోలి అభ్యర్థి భూపిందర్ హుడా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఇది హర్యానా ప్రజల విజయమని, హర్యానాలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
ఇక జమ్ము కశ్మీర్ లో బీజేపీకి షాక్ తప్పేలా లేదు. ఆర్టికల్ 370 రద్దుతో తమకే ఓట్లు ఎక్కువగా పడతాయని భావించగా ఊహించని ఎదురుదెబ్బే తగిలేలా ఉంది. ట్రెండ్స్ లో కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు 48 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా బీజేపీ 28 స్థానాల్లో, ఇతరులు 14 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. హర్యానాలో బీజేపీ, జమ్ములో కాంగ్రెస్ కూటమి లీడింగ్ లో ఉండగా రెండు చోట్లా తమదే గెలుపు అవుతుందని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి