కుత్బుల్లాపూర్ కాలేశ్వరం ప్రాజెక్ట్ ఒక స్కామ్ అని ప్రజలకు ఉపయోగపడని ప్రాజెక్టు అని కాంగ్రెస్ పార్టీ జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ షమ మహమ్మద్ అన్నారు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, వాటికి ఇప్పటివరకు మచ్చలేదని తెలిపారు. ఇటీవల కర్ణాటకలో గెలుపొందిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలను విజయవంతంగా ప్రజలకు అందజేస్తుందని , అక్కడి ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణలోనూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాగానే అర్హులందరికీ 6 గ్యారంటీ పథకాలను అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కమిషన్ల కకృతి కోసం కెసిఆర్ ప్రభుత్వం కాలేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టి నిరుపయోగంగా కోట్ల రూపాయలు వృధా చేశారని… కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మాణం జరిగిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకునే కెసిఆర్ రైతులకు ఏం న్యాయం చేశారని ఆయన ప్రశ్నించారు.. కాలేశ్వరం కట్టి ఎంత మంది రైతులకు ఉపయోగకరంగా మార్చారో తెలపాలన్నారు.
Political
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడుపైన కేసులు పెడుతున్నారన్నారు పురందేశ్వరి. రాష్ట్రంలో నిరంకుశత పాలన నడుస్తోందని మండిపడ్డారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరుల మీద కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంపై తాము లేవనెత్తిన ప్రశ్నలు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాబోయే ఎన్నికలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ అంశంపై అగ్రనాయకులు చూసుకుంటారని తెలిపారు. మిగిలిన పొత్తులు సాధారణంగా ఎన్నికలు రెండు నెలలు ముందు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ట్రాక్టర్లు పెద్దపెద్ద జేసీపీలతో నదుల్లో ఇసుక మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నిజమైన సామాజిక న్యాయం చేస్తున్నది ప్రజలకు సబకే సత్, సబ్కె వికాస్ ముందుకెళ్తున్నామని పురందేశ్వరి పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, సీఈవోలు ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. సాధారణ నేర కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయన్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో మాట్లాడి సరిహద్దు చెక్ పోస్టులను కట్టుదిట్టం చేశామన్నారు. రాష్ట్రంలో నిఘా మరింత పెంచామన్నారు. ఇప్పటి వరకు రూ.385 కోట్ల మేర నగదును జప్తు చేసినట్లు చెప్పారు. 182 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామన్నారు. తెలంగాణ సరిహద్దులోని పదిహేడు జిల్లాల్లో 166 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సరిహద్దుల్లోని పొరుగు రాష్ట్రాల్లో 154 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల రాకపోకలకు అవకాశం లేకుండా పోలింగ్ తేదీకి ముందే సరిహద్దులను మూసివేసి, అప్రమత్తంగా ఉండాలని సూచిన్నట్లు తెలిపారు.
బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు మూడురోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం కరీంనగర్ విచ్చేశారు. ఈ సందర్భంగా దారి మధ్యలో రేణిగుంట టోల్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు బండి సంజయ్ వాహనాన్ని ఆపారు. విస్త్రత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ వారికి సహకరించారు.
తన నివాసంపై గుర్తుతెలియని దుండగుల దాడి విషయంలో గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ స్పందించారు. మతి స్దిమితం లేని వ్యక్తి, మద్యం మత్తులో చేసిన చేష్టలుగా పోలీసులు చెప్పారంటూ.. పోలీసులపై వ్యంగ్యాస్త్రాలు.. పోలీసులు చెప్పినది నిజమైతే హుందాగా వ్యవహరిస్తామని..అందులో నిజం లేకుంటే వైసిపి సత్తా ఏంటో చూపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు విడుదల సమయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో ప్రతి వ్యాఖ్యలు చేశారు.
నిజాయితీ, నిబద్ధలతో ప్రజాభిమానాన్ని చురగొన్న నేత దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లాలో ఏ నేత పొందని రీతిలో గౌతమ్ రెడ్డి ప్రజామన్ననలు పొందారని మంత్రి కొనియాడారు. మేకపాటి గౌతంరెడ్డి 52వ జయంతి పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు సెంటర్ లో ఏర్పాటుచేసిన కాంస్య విగ్రహావిష్కరణ మంత్రి కాకాని ఆవిష్కరించారు. ప్రతిపక్ష నేతలలోనూ మంచి వ్యక్తిగా.. నేతగా ఎదిగారని అన్నారు. గౌతమ్ రెడ్డికి నెల్లూరులో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. విగ్రహా ఏర్పాటుకు సహకరించిన శాసనసభ్యులు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో గాంధీభవన్‌కు సెక్యూరిటీ సిబ్బంది తాళం వేశారు. ఇబ్రహీం పట్నం కార్యకర్తలు గాంధీభవన్ వద్ద హంగామా చేస్తుండటంతో హై టెన్షన్ చోటు చేసుకుంది. రేవంత్ ఫ్లెక్సీలను కార్యకర్తలు తగలబెట్టారు. గాలిలోకి కుర్చీలను దండెంరాంరెడ్డి వర్గీయులు విసిరేశారు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నాడని.. టికెట్ ఇవ్వకుంటే రెబల్ గా పోటీచేస్తానని రాంరెడ్డి తెలిపారు.
బీజేపీ మూడో లిస్ట్ ను విడుదల చేయడంతో కాంగ్రెస్ విడుదల చేసే మూడో జాబితాపై అందరి దృష్టి పడింది. ఇప్పటి వరకు రెండు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించనుంది. వామపక్షాల సీట్ల సర్దుబాటు, మరికొన్ని స్థానాల అభ్యర్థుల మార్పు విషయంపై హస్తం పార్టీ తర్జనభర్జనలు పడుతోంది. రెండో జాబితా ప్రకటన తర్వాత పార్టీలో చెలరేగిన అసమ్మతి సెగను దృష్టిలో ఉంచుకుని మూడో జాబితాపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేసింది
నిర్మల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. కరెంట్ 3 గంటలు చాలని పీసీసీ చీఫ్ అంటున్నారని మండి పడ్డారు. ధరణి పోర్టల్ ఉండాలా? వద్దా? అన్నారు. రైతు బంధు పథకం ఓట్ల కోసం కాదన్నారు. అన్ని పార్టీల అభ్యర్థుల గురించి ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఏపార్టీ గెలిస్తే లాభమో ఆలోచించాలన్నారు. ప్రతీ పార్టీ చరిత్ర చూడాలన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావద్దన్నారు. అన్నీ ఆలోచించి ఓటేయ్యాలని ప్రజలకు సూచించారు. పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్ని.. తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా..? అన్నారు. నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి మెజార్టీ 70 నుంచి 80 వేలు దాటాలన్నారు. మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని ఫైర్ అయ్యారు. దళిత బంధు పుట్టించింది కేసీఆర్ అన్నారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చామన్నారు. రైతు బంధు కూడా అందించామన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ పల్లి, గద్దెగూడెం, అడవి అజిలాపూర్, కోయిల్ సాగర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామాలకు చెందిన మహిళలు మంగలహారతులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 2014 వరకు నియోజకవర్గం ఎడరిగా ఉండేదని ఇప్పుడు పచ్చన్ని పొలాలతో కళకళ లాడుతుంది. కోయిల్ సాగర్ నుండి వెంకటయ పల్లి మీదిగా కెనాల్ పనులు కేసుల కారణంగా ఆలస్యం అయిందని త్వరలో పనులు పూర్తి చేస్తామన్నారు, వెంకటాయపల్లి ఒక్క గ్రామానికి 65 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 20 మందికి గృహలక్ష్మి మరియు దళిత బంద్, బిసి బంద్ లాంటి పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ఓటేస్తే 3 గంటల కరెంటు వస్తుందని, రైతుబంధు లాంటి పథకాలు ఆపివేస్తారు. కావున ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..ఈ నెల 6 న దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బారి బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు జట్టి నరసింహారెడ్డి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ పార్వతమ్మ మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు…




Total views : 92517