Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా సాలూరు రైల్వే స్టేషన్‌..

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా సాలూరు రైల్వే స్టేషన్‌..

by CVR NEWS
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా సాలూరు రైల్వే స్టేషన్‌

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు రైల్వే స్టేషన్… ఒకప్పుడు ఈ ప్రాంత ప్రజల జీవనాడిగా నిలిచిన కేంద్రం. ఇప్పుడు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. బ్రిటిష్ కాలం నుంచే రైళ్ల రాకపోకలతో గిరిజన ప్రాంతాలకు ఆర్థికంగా బలాన్ని ఇచ్చిన ఈ స్టేషన్, నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం ఆందోళన కలిగిస్తోంది. గోధుమలు, సిమెంట్ వంటి సరుకులు రైళ్ల ద్వారా వచ్చి లారీలలో లోడవుతూ పలు రాష్ట్రాలకు తరలించేవారు . దీని ద్వారా వందలాది కార్మిక కుటుంబాలు ఉపాధి పొందేవి. కానీ 2003లో నష్టాల పేరుతో రైళ్లను నిలిపివేయడం, తరువాత రైలు బస్సును కూడా నిలిపివేయడం వల్ల సాలూరు ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయింది. రైల్వే సిబ్బంది లేకపోవడంతో క్వార్టర్స్ శిథిలావస్థకు చేరుకోవడం, దొంగతనాలు పెరగడం పరిస్థితిని మరింత దిగజార్చాయి. స్థానిక ప్రజలు పునరుద్ధరణ కోసం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది.

సాలూరు రైల్వే స్టేషన్‌ పరిస్థితి ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజల ఆవేదనకు ప్రతీకగా మారింది. ఒకప్పుడు రైల్వే రాకపోకలతో కళకళలాడిన ఈ స్టేషన్, నేడు నిశ్శబ్దంగా మారి అసాంఘిక శక్తులకు కేంద్రంగా మారడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రైల్వే గోడౌన్ ఆధారంగా జీవనం సాగించిన కార్మికులు ఉపాధి కోల్పోయి వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైల్వే క్వార్టర్స్ ఖాళీగా ఉండటంతో అవి శిథిలాలుగా మారి దొంగల బారిన పడటం జరుగుతుంది . రైల్ పునరుద్ధరణ పనులు జరిగి 2018లో ట్రైల్ రన్ నిర్వహించినా, ఇప్పటివరకు రైళ్లు పునరుద్ధరించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది.దీనికి సంబంధించిన ఫైల్ భువనేశ్వర్ DRM వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది . స్థానిక ప్రజలు ఎన్నిసార్లు వినతులు చేసినా, ఫైళ్లు ఒక కార్యాలయం నుంచి మరొక కార్యాలయానికి తిరుగుతూనే ఉన్నాయి. పాలకులు చొరవ చూపకపోతే ఈ ప్రాంత అభివృద్ధి పూర్తిగా నిలిచిపోతుందన్న ఆందోళన పెరుగుతోంది. దీనిపై స్థానికుల నుంచి ఫోన్ ఇన్ లో మరింత వివరాలు తెలుసుకుందాం ..

సాలూరు రైల్వే స్టేషన్‌ కథ… అభివృద్ధి నుంచి నిర్లక్ష్యానికి పడిపోయిన దారుణ ఉదాహరణగా నిలుస్తోంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ స్టేషన్, సాలూరు పరిసర గ్రామాల అభివృద్ధికి కీలక పాత్ర పోషించింది. రైళ్ల ద్వారా సరుకుల రవాణా, ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతం ఆర్థికంగా బలపడింది. కానీ నష్టాల పేరుతో రైళ్లను నిలిపివేయడం, తరువాత కరోనా సమయంలో రైలు బస్సును కూడా ఆపేయడం వల్ల సాలూరు ప్రజలు పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డారు. రైల్వే సిబ్బంది బదిలీ కావడంతో క్వార్టర్స్ ఖాళీగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని అసాంఘిక కార్యకలాపాలు పెరగడం మరింత ప్రమాదకరంగా మారింది. రైల్వే అధికారులు ట్రైల్ రన్స్ నిర్వహించినా, అమలు చేయకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఇప్పటికైనా కేంద్రం, రాష్ట్రం కలిసి చర్యలు తీసుకుంటేనే సాలూరుకు మళ్లీ రైలు సౌకర్యం కలిగే అవకాశం ఉంది.

Advertisements

You may also like

Our Visitor

039857
Total views : 201064

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: