Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Telangana బొగ్గుగనుల వేలంపై కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి రీట్వీట్

బొగ్గుగనుల వేలంపై కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి రీట్వీట్

by Satya
బొగ్గుగనుల వేలంపై కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి రీట్వీట్

బొగ్గు గనుల వేలంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ల యుద్ధం సాగింది. ‘రేవంత్ గారూ’ అని కేటీఆర్ ట్వీట్ చేసి ప్రశ్నిస్తే… ‘కేటీఆర్ గారూ’ అంటూ రేవంత్ రెడ్డి ప్రతిస్పందించారు.
పీసీసీ అధ్యక్షుడిగా 2021లో మీరు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాక్‌లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం గుర్తుంచుకోవాలంటూ నాడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని… కానీ అప్పుడు వేలాన్ని వ్యతిరేకించి, ఇప్పుడు వేలం పాట కోసం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను పంపించడం ఏమిటని విమర్శించారు. మీలో మార్పుకు గల కారణాలు చెప్పాలని నిలదీశారు.
బొగ్గుగనుల వేలంపై కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి రీట్వీట్ చేస్తూ సమాధానం ఇచ్చారు. పదేళ్లుగా మీరు తెలంగాణ ఏం చెబుతుందో పట్టించుకోలేదని… ఇప్పుడు కూడా మీది అదే ధోరణి అని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు, కేడర్ అంతా కేంద్ర ప్రభుత్వ, గత కేసీఆర్ ప్రభుత్వ ప్రైవేటీకరణను వ్యతిరేకించిందని పేర్కొన్నారు. సింగరేణి మొదటి, రెండో బ్లాక్‌లను కేంద్రం విక్రయించినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారని… నాడు అరబిందో, అవంతిక కంపెనీలకు విక్రయించారన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకించలేదని విమర్శించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సింగరేణి బ్లాక్‌ల ప్రైవేటీకరణను, వేలాన్ని వ్యతిరేకిస్తున్నారని… అదే సమయంలో అవంతిక, అరబిందోలకు విక్రయించిన బొగ్గు బ్లాక్‌లను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. బొగ్గుగనుల వేలంపై కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి రీట్వీట్ చేసారు . తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులు, భవిష్యత్తు… కాంగ్రెస్‌తోనే సురక్షితమన్నారు. మన బొగ్గు గురించి మాత్రమే కాదు… ప్రజల ప్రతి హక్కు గురించి పోరాడుతామన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.
    కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
  • కీలక దశకు చేరిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్.
    తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. వరుసగా చోటుచేసుకున్న పరిణామాలపై క్రమశిక్షణా కమిటీ దృష్టి సారించింది. ఇప్పటికే కొండా సురేఖ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలు, అందుబాటులో ఉన్న ఇతర అంశాలను కమిటీ పరిశీలించినట్లు…
  • రష్యా–ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు.
    రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విస్తృత దాడులు కొనసాగిస్తుండగా.. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగంలోని చమురు, పోర్టు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సుదూర డ్రోన్ దాడులు చేస్తోంది. ఆగస్టు…
  • స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కావడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. స్టార్టప్‌ల శక్తి, ఆశయం తనను ఎప్పటిలాగే ముగ్ధుడిని చేశాయని పేర్కొన్నారు. యువ సంస్థల ఆలోచనలు,…
  • పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు.
    పశ్చిమాసియాలో యూఎస్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుండగా.. ఆర్థిక ఒత్తిడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదిస్తున్న కొత్త ఆంక్షలను ఎదుర్కొంటామని ప్రకటించింది. మరోవైపు ప్రపంచ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: