Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh రోజా, బైరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న విజిలెన్స్..

రోజా, బైరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న విజిలెన్స్..

by CVR NEWS

వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘‘ఆడుదాం.. ఆంధ్రా’’ పేరిట సాగిన అవినీతి ఆటపై విజిలెన్స్‌ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం విచారణ జరిపిన విజిలెన్స్‌ అధికారులు ముప్పయి పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అవినీతిలో అప్పటి క్రీడాశాఖ మంత్రి రోజా, శాప్‌ మాజీ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు. వీరిద్దరిపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వీరితో పాటు అప్పటి శాప్‌ ఇన్‌చార్జి ఎండీ హర్షవర్ధన్‌పైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అప్పటి స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌, మరో ఐఏఎస్‌ అధికారి ధ్యాన్‌చంద్‌తో పాటు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి వాణీమోహన్‌పైనా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. శాప్‌లోని ఐటీ విభాగంలో పనిచేసే వారు సైతం ఈ అవినీతికి పూర్తిగా సహకరించారని, వారిపైనా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎన్నికలకు ముందు ఓట్ల కోసమే వైసీపీ నేతలు ఆడుదాం.. ఆంధ్రా పేరిట యువతను మభ్యపెట్టేందుకు ప్రయత్నించి అవకతవకలు కు‌ పాల్పడ్డారని నివేదికలో స్పష్టం చేశారు. నిధులు పక్కదారి పట్టించి జేబులు నింపుకున్నారు. శాప్‌ కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తూ క్రీడాకారులకు అన్యాయం చేసింది. ఆడుదాం.. ఆంధ్రా పేరిట మొత్తం రూ.40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగమైనట్లు నిర్ధారణ చేశారువిజిలెన్స్‌ అధికారులు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: