Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీం ఫైర్

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీం ఫైర్

by Satya
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీం ఫైర్

వివాదాస్పద అధికారికి ఉన్నత పదవి కట్టబెట్టే ప్రయత్నం చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దని, సీఎం అంటే రాజు కాదని హితవు చెప్పింది. ఓ పిటిషన్ విచారణలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్ కు చెందిన ఐఏఎఫ్ ఆఫీసర్ ఒకరికి రాజాజీ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ పదవి కట్టబెట్టేందుకు సీఎం ధామి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, సదరు అధికారి వ్యవహారం వివాదాస్పదమంటూ ఇతర అధికారులు, మంత్రులు అభ్యంతరం చెప్పారు. అయినా సీఎం ధామి వినిపించుకోకపోవడంతో పలువురు అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ పై డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీ ఒకటి పెండింగ్ లో ఉందని, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అధికారికి ఉన్నత పదవి కట్టబెట్టాలని చూడడమేంటని ప్రశ్నించింది. రాహుల్ పై సీఎం ధామికి ఎందుకంత ప్రేమ అని నిలదీసింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీం ఫైర్ ఇతర సీనియర్ అధికారులు వద్దంటున్నా వినిపించుకోకుండా రాహుల్ కు డైరెక్టర్ పదవి కట్టబెట్టడానికి కారణమేంటని బెంచ్ ప్రశ్నించింది. ముఖ్యమంత్రులు పూర్వ కాలపు రాజుల్లాగా ప్రవర్తించొద్దని, మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనే తప్ప రాచరికంలో కాదని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
    తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
  • ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
    తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
  • హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
    హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
  • వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
    ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
  • స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.
    స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: