Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Political వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

by Satya
వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

తెలుగు రాష్ట్రాలను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అతలాకుతలం అయ్యాయి. జన జీవనం స్తంభించింది. ఇది చాలదన్నట్లు మరోమారు తెలుగు రాష్ట్రాలకు వాన గండం పొంచి ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి వర్షం బీభత్సం సృష్టించనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. అల్పపీడనం, మాన్సూన్ ట్రఫ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం. రాబోయే రెండు రోజులు హెవీ, వెరీ హెవీ రెయిన్స్ కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. 7,8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. సెప్టెంబర్ 10వ తేదీ వరకు వర్షాల ప్రభావం ఉంటుందన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: