Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Political కరీంనగర్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాలు.

కరీంనగర్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాలు.

by CVR NEWS
కరీంనగర్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాలు

యువత తాత్కాలిక ఆనందం కోసం మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలో నిషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖ మరియు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సీపీ గౌస్ ఆలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లు ముఖ్య అతిధిగా హాజరై… జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి తెలంగాణ చౌక్ మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ర్యాలీ కొనసాగింది. తెలంగాణ చౌక్ వద్ద నర్సింగ్ విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ అందరిని ఆలోచించేలా చేసింది. పాఠశాల, కళశాల విద్యార్థులు, వైద్య విద్యార్థులు యువత, పోలీస్ అధికారులు భారీ ర్యాలీ లో పాల్గొన్నారు. డ్రగ్స్ తీసుకోవడం వలన తాత్కాలిక ఆనందం కలిగినా… పర్మినెంట్ గా జీవితాలు డామేజ్ అవుతాయని విద్యార్థులకు తెలిసేలా చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు అందరూ కృషి చేయాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కోరారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: