Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Latest News ములుగులో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష.

ములుగులో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష.

by CVR NEWS
ములుగులో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష

ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు, మేడారం అభివృద్ధి పనులు, సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు, త్వరలో జరగనున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.మేడారం అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పనులను వచ్చే 10 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం, ములుగు జిల్లాల్లో పర్యటించి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోనున్నారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. 6 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారని, ఎర్రిఘట్టమ్మ సమీపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.అదే విధంగా ములుగు కలెక్టరేట్ నూతన భవనం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, కేంద్ర విద్యాలయంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నట్లు మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి పర్యటన తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: