Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh వైసీపీ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది -మంత్రి లోకేష్‌..

వైసీపీ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది -మంత్రి లోకేష్‌..

by CVR NEWS
వైసీపీ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది -మంత్రి లోకేష్‌

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పూర్తిగా నిలిపివేసిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారం వందశాతం అవాస్తవమని, కిట్ల పంపిణీని ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం కొన్ని అంతర్జాతీయ కారణాల వల్ల కిట్ల సరఫరాలో సుమారు నెల రోజుల జాప్యం జరుగుతోందని తెలిపారు.
ప్రభుత్వం నిజాయతీగా జాప్యం గురించి వెల్లడిస్తే, దానిని వక్రీకరించి అసలు కిట్లే ఇవ్వరంటూ వైసీపీ పార్టీ విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనమని విమర్శించారు.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిసరుకుల ధరలు పెరగడం, రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో యూనిఫాం క్లాత్, బూట్లు, బ్యాగుల సరఫరా ఆలస్యమవుతోందని విద్యాశాఖ అధికారులు తెలిపినట్లు లోకేష్ వివరించారు. అయితే, జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ కచ్చితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన వస్తువులను కూడా వీలైనంత త్వరగా పంపిణీ చేసేందుకు అధికారులు తయారీ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని లోకేష్ తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

040928
Total views : 212406

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: