జగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానమిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సరైన సమాధానం ఇస్తుందన్నారు. అభివృద్ధి అనేది ఒకచోట ఆగేది కాదన్న చంద్రబాబు… హైదరాబాద్కు ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు, ఐటీ రంగం ఆదాయాన్ని పెంచాయన్నారు. సైబరాబాద్ వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందుతూనే ఉంది..అదే విధంగా అమరావతి కూడా ఇదే తరహాలో నిరంతరం అభివృద్ధి చెందుతుందని సీఎం స్పష్టం చేశారు. కడప జిల్లా ఖాజీపేటలో బాలిక గొంతుకోసి హత్య చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. మహిళలు, బాలికలపై దాడులకు తెగబడితే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేసే విషయంలో నిందితులని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని స్పష్టంచేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులు, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అంతకుముందు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు.
Tag: