సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తో ఫేస్ టూ ఫేస్ యాంకర్ కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తుల అంశం పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రెండు రోజుల అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలే వైరా , మిర్యాలగూడ సీట్లు కేటాయిస్తామని ప్రతిపాదించి, ప్రస్తుతం మాట మారుస్తున్నారని అన్నారు. పొత్తుల అంశం లో కాంగ్రెస్ తీరు సరిగా లేదని విమర్శించారు. వైరా, మిర్యాలగూడ స్థానాలు కేటాయించని పక్షంలో పొత్తుల ప్రసక్తి ఉండదని స్పష్టం చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సంతోష్ ఫేస్ టూ ఫేస్.
కాంగ్రెస్
కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని డాక్టర్ వెన్నెల ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజా నౌక,ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెలకు టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు,గద్దర్ అభిమానులు,కళాకారులు వెన్నెల ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెన్నెల మీడియాతో మాట్లాడారు. నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ టికెట్ కేటాయించిన సోనియా,రాహుల్ ,రేవంత్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తానని అన్నారు. గద్దర్ బిడ్డ గా ముందుకెళ్తానని, భారీ మెజారిటీ తో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ అవుతుందనుకుంటే బంగారు కుటుంబం మాత్రం అయిందని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినా వారు మళ్లీ కేసీఆర్‌కు అమ్ముడుపోవడం ఖాయమన్నారు. బీజేపీ గెలిస్తే గ్రామపంచాయతీ నుంచి సీఎం కార్యాలయం వరకు అవినీతి లేకుండా చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఆరు లైన్స్ జాతీయ రహదారిని, ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు. అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రతిరోజు కార్యాలయానికి వచ్చే ముఖ్యమంత్రి వస్తారన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా మెజార్టీ స్థానాలు బీజేపీ గెలుచుకోవడం ఖాయమన్నారు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌లోనే పుట్టారని, ఆ పార్టీలో పని చేశారని, ఈ విషయం రాహుల్ గాంధీకి తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా పని చేశారన్నారు. గతంలో పలుమార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయన్నారు.
డీకే అరుణ బీజేపీకి గుడ్ బై చెపుతున్నారంటూ వస్తున్న వార్తలపై డీకే అరుణ స్పందించారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ లో చేరే అవకాశమే లేదని చెప్పారు. తనపై కొందరు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధినాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేయాలంటే అదృష్టం ఉండాలని చెప్పారు. మరోవైపు, బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. నియంత కేసీఆర్ పాలనను అంతమొందించేందుకే తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆయన తెలిపారు.